Ravi Teja: రెండు నెలలు... రెండు మాస్ మూవీస్

ABN , Publish Date - Sep 08 , 2025 | 06:50 PM

రిజల్ట్ తో సంబంధం లేకుండా మాసోడు దూసుకుపోతున్నాడు. వరుసగా సినిమాలు చేయడమే కాదు... బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. డబుల్ మాస్ ట్రీట్ తో రచ్చ చేయడానికి వచ్చేస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

జయాపజయాల సంగతి ఎలా ఉన్నా మాస్ మహారాజా రవితేజ (Ravi Teja ) క్రేజ్ ఎప్పుడూ ఒకేలానే ఉంటుంది. పైగా ఫలితంతో పనిలేకుండా వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. ప్రెజెంట్ 'మాస్ జాతర' (Mass Jathara ) పై ఫుల్ ఫోకస్ పెట్టాడు రవితేజ. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా మీద వాయిదా పడుతూ చివరకు రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఫైనల్ గా అక్టోబర్ 31న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఓ రేంజ్ లో బజ్ ను క్రియేట్ చేస్తోంది.


మాస్ ఎంటర్ టైనర్ గా వస్తున్న 'మాస్ జాతర' తర్వాత రవితేజ మరో మూవీ విడుదలకు రెడీ చేస్తున్నాడు. కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో రవితేజ 76వ సినిమా అయితే ఈ మూవీకి ముందు 'అనార్కలి' టైటిల్ అనుకున్నారు. కానీ ప్రస్తుతం దానికి బదులు మరో వరైటీ పేరు పెట్టే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ చేసి నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. దీంతో రెండున్నర నెలల గ్యాప్ లోనే రెండు సినిమాలను విడుదల చేస్తూ హాట్ టాపిక్ గా మారాడు. దాంతో ఇప్పుడు పొంగల్ రేస్ లో టఫ్ ఫైట్ కనిపిస్తోంది.

వచ్చే సంక్రాంతి రేస్ లో బిగ్ మూవీస్ రేస్ లో నిలిచాయి. అందరికంటే ముందు మెగాస్టార్ చిరంజీవి కర్ఛీఫ్ వేసుకున్నాడు. అనిల్ రావిపూడితో కలిసి 'మన శంకర ప్రసాద్ గారు' ( Mana Shankara Vara Prasad Garu) తో మ్యాజిక్ చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇటు ప్రభాస్ 'ది రాజాసాబ్' (The Raja Saab) తో థియేటర్లలోకి దిగుతున్నాడు. కుర్ర హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తున్న 'అనగనగా ఒక రాజు' (Anaganaga Oka Roju ) కూడా బాక్సాఫీస్ బరిలో దిగుతుంది.ఇవే కాక విజయ్ దళపతి మూవీ 'జననాయకుడు' (Jana Nayakudu) కూడా పొంగల్ రేస్ లో నిలిచింది. సంక్రాంతికి దాదాపు నాలుగైదు సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో రవితేజ కూడా బరిలోకి దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. మరి వరుస ఫెయిల్యూర్ తో ఉన్న రవితేజ ఈ చిత్రాలతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Also: Pawan- Ramana Gogula: అప్పుడు వెంకీ... ఇప్పుడు పవన్ వంతు

Read Also: NBK: బాలకృష్ణకు మరో గౌరవం.. తొలి దక్షిణాది నటుడు

Updated Date - Sep 08 , 2025 | 06:53 PM