నాన్న కష్టం చూస్తూ పెరిగా.. అక్కే అంతా! -పవన్ కళ్యాణ్
ABN , Publish Date - May 20 , 2026 | 03:44 PM
బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రం ‘పురుష:’. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.
బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రం ‘పురుష:’ (Purushaha). ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల (Pavan Kalyan Battula) హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోన్నారు. వీరు వులవల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను మే 22న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ వేడుక (Purushaha Pre Release Event)ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో బత్తుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘పురుష:’ సినిమాని ఈ స్థాయికి తీసుకు వచ్చిన మా నాన్న, నిర్మాత కోటేశ్వరరావుకు, అక్క సరస్వతికి థాంక్స్. మా దర్శకుడు వీరు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. నాకు ఈ జర్నీలో ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. సాంకేతిక నిపుణులందరూ ఎంతగానో సహకరించారు. సప్తగిరి అన్న, కసిరెడ్డి అన్న నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. వారే నా సిగ్గు, భయాన్ని, బిడియాన్ని పోగొట్టారు. వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, వీటీవీ గణేష్ వంటి వారితో వర్క్ చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మా నాన్నకు థాంక్స్. మా నాన్న కష్టం చూస్తూ నేను పెరిగాను. నా కోసం మా అక్క ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. నేనంటే ప్రాణం తనకి. మే 22న థియేటర్లో కలుద్దామని అన్నారు.
దర్శకుడు వీరు వులవల మాట్లాడుతూ.. సరస్వతి బత్తుల వల్లే ‘పురుష:’ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఈ జర్నీలోని ప్రతీ దశలో ఆమె మాకు ఎంతగానో సపోర్ట్ అందించారు. కథ విన్నాక, స్టోరీ బోర్డ్ చూశాక నిర్మాత కోటేశ్వరరావు ఓకే చెప్పారు. ఖర్చుకి ఎక్కడా వెనుకడుగు వేయలేదు. నాకు ఈ అవకాశం ఇప్పించిన సతీష్ ముత్యాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇందులో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ.. సినిమా కోసం ఎంతగానో కృషి చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. మే 22న అందరూ మా సినిమాను థియేటర్లలో చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.
నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. నాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. కానీ, నాకు సినిమాలంటే చాలా ఇష్టం. మా అమ్మ తర్వాత సినిమానే నాకు గురువు. సినిమా నాకెంతో నేర్పింది. అందుకే నా వంతుగా ఈ సినిమా పరిశ్రమకు వచ్చి మంచి చిత్రాన్ని తీశాను. నా కోరికను నెరవేర్చుతున్న నా కొడుకు పవన్ కళ్యాణ్‌కు థాంక్స్. నా కొడుక్కి నేను, వాళ్ల అమ్మ, అక్క.. ఈ ముగ్గురే ప్రపంచం. నా ఈ ప్రయాణంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాను అందరూ చూసి సపోర్ట్ చేయండని కోరారు. నిర్మాత సరస్వతి బత్తుల మాట్లాడుతూ.. మా నాన్న, తమ్ముడి వల్లే ఇక్కడి వరకు రాగలిగాను. అసలు, ఇలా ఈ స్టేజ్ మీదకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీ టైంలో స్టోరీలు రాసుకునేదాన్ని, డైరెక్టర్ అవ్వాలని అనుకునే దాన్ని. కానీ ఎప్పుడూ నా ఆలోచనల్ని ఎవరితో షేర్ చేసుకోలేదు. నాకు నా తమ్ముడే సర్వస్వం. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో సప్తగిరి, ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరోయిన్ తేజస్వీ రావ్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్, కెమెరామెన్ సతీష్ ముత్యాల, మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్, ఆర్ట్ డైరెక్టర్ రవి, ఎడిటర్ కోటి వంటి వారంతా మాట్లాడుతూ.. ఈ సినిమాను సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరారు.
ఇవి కూడా చదవండి:
చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!
Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!
యంగ్ టైగర్‌కు పవర్ స్టార్ బర్త్‌డే విషెస్.. ట్వీట్ వైరల్!
నాకు కాబోయే భర్త ఇండస్ట్రీ వ్యక్తి కాకూడదు: అనన్య నాగళ్ల