Purusha:  ‘కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా’..  వైష్ణవి  ఫస్ట్ లుక్  

ABN , Publish Date - Dec 18 , 2025 | 09:33 PM

‘పురుష:’ టీం మాత్రం కేవలం కాన్సెప్ట్ పోస్టర్లు, ట్యాగ్ లైన్స్, ఇంట్రడక్షన్ పోస్టర్లతోనే ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా హీరోయిన్ వైష్ణవి కొక్కుర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఓ సినిమాను ఆడియెన్స్‌లోకి తీసుకెళ్లడం, చిత్రం విడుదలకు ముందే హైప్ పెంచడం అంటే మామూలు విషయం కాదు. కానీ ‘పురుష:’ (Purusha:) టీం మాత్రం కేవలం కాన్సెప్ట్ పోస్టర్లు, ట్యాగ్ లైన్స్, ఇంట్రడక్షన్ పోస్టర్లతోనే ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా హీరోయిన్ వైష్ణవి కొక్కుర (vaishnavi Kokkura) పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. భార్యాభర్తల మధ్య గొడవ, ఒకే ఒరలో రెండు కత్తులు ఉండలేవు అనేట్టు సింబాలిక్‌గా పోస్టర్లో  చూపించినట్టు అనిపిస్తోంది. ‘కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది.  

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు.  వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు.కసిరెడ్డి, సప్తగిరి పాత్రలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని పోస్టర్లను చూస్తే అర్థం అవుతోంది.  వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా సాగే సినిమా ఇది.  ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నాము' అని  నిర్మాత చెప్పారు. 

Updated Date - Dec 18 , 2025 | 09:33 PM