యంగ్ టైగర్‌కు పవర్ స్టార్ బర్త్‌డే విషెస్.. ట్వీట్ వైరల్!
ABN , Publish Date - May 20 , 2026 | 10:56 AM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు చెబుతున్న విషెస్‌తో.. ఎన్టీఆర్ పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR) పుట్టినరోజును (HBD NTR) పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు చెబుతున్న విషెస్‌తో.. ఎన్టీఆర్ పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. మరోవైపు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ మూవీ నుంచి బర్త్‌డే స్పెషల్‌గా విడుదలైన గ్లింప్స్ కూడా ట్రెండ్‌ని షేక్ చేస్తోంది. మొత్తంగా అయితే సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ నామ జపం జరుగుతోంది. తాజాగా ఎన్టీఆర్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (PKCW) ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది.
ఈ పోస్ట్‌లో.. ‘‘ప్రముఖ కథానాయకులు ఎన్టీఆర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే మీకు, సంపూర్ణ ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) పేర్కొన్నారు. దీనికి ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు.. టాలీవుడ్ దర్శకులైన బాబీ, గోపీచంద్ మలినేని, శ్రీను వైట్ల వంటి వారంతా తారక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉంటే, కోలీవుడ్ నుంచి యంగ్ టైగర్‌పై సీనియర్ నటి ఖుష్బూ చేసిన ట్వీట్ వార్తలలో హైలెట్ అవుతోంది. ఆమె తన ట్వీట్‌లో.. ‘‘నాకు ఎంతగానో ఇష్టమైన వ్యక్తి, నేను అభిమానించే వ్యక్తి.. నా హీరో ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. లవ్ యూ కన్నా. నా హీరో, నా తారక్, నా డ్రాగన్’’ అంటూ ఆమె చేసిన పోస్ట్ నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఎన్టీఆర్ అంటే ఆమెకు ఎంత ఇష్టమో ఈ ట్వీట్ తెలియజేస్తోందంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఎన్నో మధురమైన జ్ఞాపకాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. డ్రాగన్ గ్లింప్స్ అదిరింది’’ అంటూ నారా రోహిత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలా, సోషల్ మీడియా వేదికగా తారక్‌పై శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.
ఇవి కూడా చదవండి:
యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్’ చేసేది ఆ రోజే!
నాకు కాబోయే భర్త ఇండస్ట్రీ వ్యక్తి కాకూడదు: అనన్య నాగళ్ల
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు: జయం రవికి భార్య ఆర్తి కౌంటర్!
మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!