Purushaha: ‘పురుష’.. నుంచి హీరోయిన్ విషిక ఫస్ట్ లుక్ పోస్టర్

ABN , Publish Date - Jan 07 , 2026 | 10:35 PM

భార్యాభర్తల కథతో వస్తున్న ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ‘పురుష:’ నుంచి హీరోయిన్ విషిక కారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

Purushaha

భార్యాభర్తల మధ్య వచ్చే సరదా పోరును వినోదాత్మకంగా చూపించే సినిమాలు ఎప్పటికీ ఆడియెన్స్‌కు దగ్గరగా ఉంటాయి. అలాంటి ఫ్యామిలీ కామెడీ కథతో, కొత్త తరానికి నచ్చే ట్రెండీ మేకింగ్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘పురుష:’. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్నారు. వీరు ఉలవల దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సాధారణంగా టీజర్ లేదా ట్రైలర్‌తో ఆసక్తి పెరుగుతుంటే, ‘పురుష:’ టీమ్ మాత్రం కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్లు, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ డిజైన్లతోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది.

ఇప్పటి వరకు హీరోలు, ఇతర పాత్రల స్వభావాన్ని తెలియజేసేలా వచ్చిన పోస్టర్లు నవ్వులు పూయించాయి. ఇప్పుడు అదే తరహాలో హీరోయిన్ల పాత్రలను ఒక్కో పోస్టర్ ద్వారా పరిచయం చేస్తూ హైప్‌ను కొనసాగిస్తున్నారు. ముందుగా వైష్ణవి పాత్రను ఎమోషనల్ టచ్‌తో, హాసిని పాత్రను రెబల్ షేడ్‌లో చూపించారు.

Purushaha

తాజాగా హీరోయిన్ విషిక క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విషిక పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా, డామినెంట్ నేచర్‌తో కనిపిస్తోంది. “దమ్ముంటే టచ్ చేసి చూడు” అనే క్యాప్షన్ ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ లుక్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సతీష్ ముత్యాల నిర్వహిస్తుండగా, సంగీతాన్ని శ్రవణ్ భరద్వాజ్ అందిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను కోటి, ఆర్ట్ డైరెక్షన్‌ను రవిబాబు దొండపాటి చూసుకుంటున్నారు.

వెన్నెల కిషోర్, వి.టి.వి. గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి ప్రముఖ హాస్య నటులు ఈ సినిమాలో కనిపించనున్నారు. వీరి కామెడీ ట్రాక్ సినిమా ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Updated Date - Jan 07 , 2026 | 10:35 PM