Purushaha: సార్.. మా ఫ్రెండ్స్ కంటే మీదే బాగుంది! టీజర్‌తోనే.. నవ్వించి చంపేలా ఉన్నారుగా
ABN , Publish Date - Jan 09 , 2026 | 10:18 PM
బీ పవన్ కల్యాణ్, సప్తగిరి, రాజ్ కసిరెడ్డి హీరోలుగా తెరకెక్కుతున్న నూతన చిత్రం పురుష:
బీ పవన్ కల్యాణ్ (Pavan Kalyan.B), సప్తగిరి (Saptagiri), రాజ్ కసిరెడ్డి (Rajkumar) హీరోలుగా తెరకెక్కుతున్న నూతన చిత్రం పురుష: (Purushaha). వైష్ణవి, విషిక, హసిని, నాయికలుగా నటిస్తున్నారు.వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ఎదటుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ను చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుల యాత్ర కన్పమ్ అనేలా ఉంది.
రెండు మూడు వందల కోట్ల బడ్జెట్ సినిమాలకు ఇతర హీరోలు వాయిస్ అరువు ఇచ్చినట్టుగా ఈ మూవీకి ఆ రేంజ్‌లోనే శుభలేక సుధాకర్‌తో వాయిస్ ఓవర్‌లో ప్రారంభించి ప్రతి సీన్‌లో నవ్వులు పూయించారు. ప్రపంచాన్ని జయించడానికి ముగ్గురు యోధులు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు అంటూ చెబుతూ అదే సమయంలో భార్యలతో వారి పాట్లను చూయిస్తూ నవ్వులు పూయించారు. టీజర్ చూస్తే సినిమా ఇట్టే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది. మీరూ ఓ లుక్కేయండి.