నాకు కాబోయే భర్త అలా ఉండాలి: అనన్య నాగళ్ల

అనన్య నాగళ్ల.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే.

ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ భామ పేరు బాగా వైరలైన విషయం తెలిసిందే. 

తాజాగా ఈ భామ తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో క్లారిటీగా చెప్పింది.

కాబోయే భర్తపై తనకు కొన్ని అంచనాలున్నాయని తెలుపుతూ.. అవేంటో తెలిపింది.

అనన్య నాగళ్లకు నిజాయితీగా ఉండే మగాళ్లంటే చాలా ఇష్టమట.

అలా నిజాయితీగా ఉండే వ్యక్తి తారసపడితే.. కచ్చితంగా అతడితో డేటింగ్ చేస్తానంటోంది. 

కాకపోతే.. ఆ వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాకూడదని కండీషన్ పెట్టింది.

అందుకు కారణం.. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితే తనకు భయమట!

అందుకే ఇండస్ట్రీ వెలుపలి వ్యక్తి కోసం గాలిస్తున్నానని చెబుతోందీ భామ.

అలాంటి వాడు దొరికితే మాత్రం.. ఆలోచించకుండా పెళ్లి చేసుకుంటానంటోంది.

మరి ఇండస్ట్రీలో వ్యక్తి అంటే ఎందుకు భయమనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇండస్ట్రీ బయటి వ్యక్తుల్లో నిజాయితీపరులను ఈ భామ ఎలా గుర్తిస్తుందో చూడాలి.

నిజంగా అలాంటి నిజాయితీపరుడు ఈ భామకు దొరుకుతారా?

లేదంటే, ముందు జాగ్రత్తగా ఏదో అలా చెప్పిందా? అని అంతా అనుకుంటున్నారు.