Purusha: ‘పురుష: స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం

ABN , Publish Date - Nov 04 , 2025 | 07:03 PM

ప్రతీ మగాడి యుద్ధం  వెనక ఓ ఆడది ఉంటుంది..  స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం అంటూ ఇలా డిఫరెంట్ క్యాప్షన్స్‌తో రకరకాల పోస్టర్లను రిలీజ్ చేస్తూ అంచనాలు పెంచుతున్న 'పురుష’ టీం

ప్రతీ మగాడి యుద్ధం  వెనక ఓ ఆడది ఉంటుంది..  స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం అంటూ ఇలా డిఫరెంట్ క్యాప్షన్స్‌తో రకరకాల పోస్టర్లను రిలీజ్ చేస్తూ అంచనాలు పెంచుతున్న 'పురుష’ టీం. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు తన తనయుడు పవన్ కళ్యాణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పురుష:’ వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో పవన్  కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, రాజీవ్ కనకాల,పమ్మి సాయి, మిర్చి కిరణ్ ఇతర పాత్రధారులు. . అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ మూవీలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు.  చిత్రీకరణ  పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

మరో పక్క సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేసారు మేకర్స్. డిఫరెంట్ పోస్టర్లు, రకరకాల క్యాప్షన్స్‌తో సినిమా కాన్సెప్ట్‌ను తెలియజేసేలా కంటెంట్‌ను బయటకు వదులుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్లు సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయి.  రిలీజ్ డేట్‌‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.

Updated Date - Nov 04 , 2025 | 07:06 PM