కాదంబరి కిరణ్ భారీ సేవా ప్రాజెక్ట్.. వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, ‘జనతా వైద్యం’ ఆస్పత్రి నిర్మాణం

ABN , Publish Date - Sep 23 , 2026 | 09:54 AM

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ నేతృత్వంలోని మనం సైతం ఫౌండేషన్ నిరాశ్రయ వృద్ధులు, అనాథల సంరక్షణ కోసం భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది.

Kadambari Kiran

సేవను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా జీవిత బాధ్యతగా మలచుకున్న మనం సైతం ఫౌండేషన్ (Manam Saitham Foundation) సపర్య - వుయ్ కేర్ ఫర్ అన్ కేర్డ్ పేరుతో నిరాశ్రయు లైన వృద్ధులు, అనాథల సంరక్షణ కోసం భారీ ప్రాజెక్టు (Old Age Home Project) ను చేపడుతున్నట్లు ప్రముఖ నటుడు, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ (Kadambari Kiran) ప్రకటించారు.

ఫిలింఛాంబ‌ర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వృద్ధాశ్రమం, అనాథాశ్రమంతో పాటు పేదలకు అందుబాటులో ఉండేలా 'జనతా వైద్యం' పేరిట ఆస్పత్రిని నిర్మించనున్నట్లు వెల్లడించారు. పచ్చని చెట్లు, వాకింగ్ ట్రాక్, వాటర్ పాండ్‌తో కూడిన ప్రశాంతమైన ప్రాంగణంలో, పూర్తి స్థాయి వసతులతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

ఆధునిక జీవనశైలిలో ఒంటరిగా మిగిలిపోతున్న వృద్ధులకు ఆత్మీయ స్పర్శను, మానవీయ భరోసాను అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. 'క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్' సహకారంతో సినీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్యనందించే ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ప్రతి యేటా ఐదుగురికి హాస్టల్ వసతితో కూడిన రెండేళ్ల ఉచిత నీట్, ఐఐటీ ప్రవేశ పరీక్ష కోచింగ్ అందించనున్నట్లు చెప్పారు.

Updated Date - Sep 23 , 2026 | 09:54 AM