బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు: అనంత శ్రీరామ్

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:03 PM

‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించి వచ్చిన విమర్శలపై దర్శకుడు బుచ్చిబాబు సానా ఎక్స్ వేదికగా క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. అలా బుచ్చిబాబు క్షమాపణలు చెప్పడం నాకు నచ్చలేదని అన్నారు.. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్.

Anantha Sriram on Buchi Babu Apology

‘పెద్ది’ (Peddi) సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్రకు సంబంధించి వచ్చిన విమర్శలపై దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ఎక్స్ వేదికగా క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. అలా బుచ్చిబాబు క్షమాపణలు చెప్పడం నాకు నచ్చలేదని అన్నారు.. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్. ఆదివారం హైదరాబాద్‌లో ‘పెద్ది’ మూవీ సక్సెస్ ప్రెస్‌మీట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత వెంకట సతీష్ కిలారు, లిరిస్ట్ అనంత శ్రీరామ్ సమాధానాలిచ్చారు. ఒక విమర్శ రాగానే, దాని నుంచి తప్పించుకోకుండా గొప్ప సంస్కారం ప్రదర్శిస్తూ క్షమాపణలు చెప్పినందుకు బుచ్చిబాబును మీడియా ప్రశంసించగా.. వెంటనే రియాక్ట్ అయిన అనంత శ్రీరామ్.. అలా క్షమాపణలు చెప్పడం నాకు నచ్చలేదని చెబుతూ.. అందుకు కారణం ఏంటో కూడా తెలిపారు.


ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ (Anantha Sriram) మాట్లాడుతూ.. ‘‘ఒక పాత్ర ఒకలాగా ప్రవర్తిస్తుందనేది.. అది దర్శకుడి ఊహ. ఆ ఊహతో సృష్టించిన పాత్ర అది. ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడగల్గిన వాడు గొప్పోడు.. పిహెచ్‌డి, పట్టభద్రులు ఆలోచనా విధానమే సరైనది.. అనేది ఎక్కువైపోవడంతో.. ఎవరైతే సోషల్ మీడియాలో ఓకల్‌గా ఉన్నారో, ఎవరైతే మాట్లాడే పదాలు గుమ్మరించి ట్రోలింగ్ చేస్తున్నారో.. వారి అభిప్రాయం రుద్దబడి ప్రభావితం అవుతున్నారు. అంతే తప్ప, ఒక దర్శకుడికి ఒక పాత్ర ఇలా ప్రవర్తిస్తుందనే స్వేచ్ఛ కూడా ఇవ్వకపోతే.. మనం సృజనాత్మకతకు ఏం చేసినట్టు?


అంటే, వైటల్ ఎట్రాక్షన్.. హార్మోనల్ రియాక్షన్స్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడితేనేమో.. చాలా ఈస్థటిక్‌గా తీసినట్లుగా ఆసమ్ అంటారు. ‘ముట్టేస్తాను’ అని హీరో తన ట్రైబల్ భాష మాట్లాడితే మాత్రం వల్గారిటీ అంటారు.. వస్తువులా చూశారని అంటారు. ఇవన్నీ చేస్తే.. సృజనాత్మకతను తొక్కేసినట్టే కదా. బుచ్చిబాబు ఎంతో సంస్కారంతో, ఎవరివో మనోభావాలు దెబ్బతిన్నాయనే ఉద్దేశంతోనో.. లేదంటే ఎవరినీ బాధ పెట్టకూడదనో సారీ చెప్పి ఉంటారు. ప్రజాస్వామ్యం అంటే 49: 51 కాదు, 99: 1 అయినా తప్పే అనే ఉద్దేశంతో ఆయన సారీ చెప్పి ఉండవచ్చు కానీ, ఇలాగే జరుగుతూ ఉంటే ముందు ముందు డాక్యుమెంటరీ సినిమాలు తప్ప కమర్షియల్ సినిమాలో గొప్ప పాయింట్‌ని చెప్పలేం’’ అని తన వాదనను వినిపించారు.

ఇవి కూడా చదవండి:

దిశా పటానీ ఇదేం అరాచకం.. ఏం పెట్టి పెంచుతున్నావ్ తల్లో!

‘ఫౌజీ’ రిలీజ్ ప్లాన్ మారిందా! అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనా?

వంగా ‘స్పిరిట్’ స్కెచ్‌కు బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం!

Updated Date - Jun 14 , 2026 | 04:03 PM

Peddi Review: రామ్‌చరణ్‌ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రం 'పెద్ది’ ఎలా ఉందంటే..

Peddi Song: ‘పెద్ది సాంగ్‌.. బుచ్చి భలే ప్లాన్‌ చేశాడు..

Peddi Movie: ట్రైలర్‌లోని ఆ షాట్‌కు.. నీకు గుడి కట్టేయవచ్చు బుచ్చి!

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Peddi - Ram Charan:  పెద్ది కోసం రామ్ చరణ్ ఫిట్‌నెస్‌ మిషన్‌