దిశా పటానీ ఇదేం అరాచకం.. ఏం పెట్టి పెంచుతున్నావ్ తల్లో!
ABN , Publish Date - Jun 13 , 2026 | 10:22 PM
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘వెల్కమ్’ ఫ్రాంచైజీలో రాబోతోన్న మూడవ చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమా ప్రమోషన్స్‌కు హాజరైన తీరుపై సోషల్ మీడియాలో ఎలాంటి చర్చలు, కామెంట్స్ నడుస్తున్నాయో తెలియంది కాదు.
దిశా పటానీ (Disha Patani) పరువాల జాతర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్‌లో చాలా పొదుపుగా దుస్తులు ధరించే హీరోయిన్ ఎవరయ్యా? అంటే వినిపించే పేరు ఆమెదే. దిశా షేర్ చేసే ఫొటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా షేక్ అవుతుంటుంది. తాజాగా ఆమె బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘వెల్కమ్’ ఫ్రాంచైజీలో రాబోతోన్న మూడవ చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’ (Welcome To The Jungle) సినిమా ప్రమోషన్స్‌కు హాజరైన తీరుపై సోషల్ మీడియాలో ఎలాంటి చర్చలు, కామెంట్స్ నడుస్తున్నాయో తెలియంది కాదు. జూన్ 26న విడుదల కాబోతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో నటించగా.. సునీల్ శెట్టి, పరేష్ రావల్, అర్షద్ వార్సి, రవీనా టాండన్, దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే..
ఈ వేడుకకు గ్రీన్ కలర్ ఔట్ ఫిట్‌లో వచ్చిన దిశా పటానీ అందరినీ ఎంతగానో ఆకర్షించింది. ఈ వేడుకలో ఆమె చాలా చలాకీగా కనిపించింది. మరీ ముఖ్యంగా తన కో నటుడు అర్షద్ వార్సీ (Arshad Warsi)తో జరుపుతోన్న సంభాషణకు సంబంధించి హల్చల్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారాయి. సినిమాకు సంబంధించి ఇతర నటులు మాట్లాడుతుండగా.. దిశా పటానీ, అర్షద్ వార్సీల మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. దిశా బైసిప్స్ గురించి అర్షద్ వార్సి ఆమెతో చర్చలు జరుపుతున్నారు. ఆమె చెయ్యిని పట్టుకుని మరీ అర్షద్ చెక్ చేస్తుండటంతో.. అక్కడున్న కెమెరాలన్నీ ఈ సంభాషణను పసిగట్టేశాయి. నేను చాలా స్ట్రాంగ్ అని దిశా పటానీ చెబుతోన్న సందర్భాన్ని వెంటనే క్లిక్ మనిపించాయి. దీంతో సోషల్ మీడియా అంతా ఈ ఫొటోలతో అల్లరల్లరవుతోంది.
అసలు దిశా వేసుకుని వచ్చిన డ్రస్సే ఓ సెన్సేషన్ అనుకుంటే.. అర్షద్‌తో ఆమె జరిపిన సంభాషణ మరో హైలెట్‌గా నిలిచి, ఈ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీని తీసుకొచ్చేసింది. మరోవైపు ఈ వేడుక కోసం దాదాపు కోటిన్నర ఖర్చు చేసినట్లుగా టాక్ నడుస్తోంది. ఒక మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక కోసం ఇంత అమౌంట్ ఖర్చు చేయడంతో.. ఇది కూడా సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో చర్చలకు తావిస్తోంది. మొత్తంగా చూస్తే, ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ, దిశా పటానీ కోసమైనా చూడాలని అనిపించేలా చేయడంలో ఆమె సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఈవెంట్‌లోని ఆమె ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుండటం చూస్తుంటే.. దిశా గ్లామర్ ట్రీట్ ఏ రేంజ్‌లో ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
‘ఫౌజీ’ రిలీజ్ ప్లాన్ మారిందా! అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనా?
వంగా ‘స్పిరిట్’ స్కెచ్‌కు బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం!
1.6 కిలోల వెండి ఖడ్గం.. మొక్కు తీర్చుకున్న సీఎం విజయ్!