‘ఫౌజీ’ రిలీజ్ ప్లాన్ మారిందా! అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనా?
ABN , Publish Date - Jun 13 , 2026 | 08:56 PM
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ‘సీతా రామం’ వంటి క్లాసిక్ హిట్‌తో తనని తాను ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఫౌజీ’. తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హిట్, ప్లాప్‌లతో అస్సలు సంబంధం లేకుండా వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. అయితే, ఈ ఏడాది ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ఆయన కెరియర్‌లోనే తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో చేసిన చిత్రం ‘ది రాజా సాబ్’. సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ప్రభాస్‌కి ఇలాంటి జానర్స్ సెట్ కావు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు కూడా చేశారు. కానీ, డార్లింగ్ ఫ్యాన్స్ అస్సలు తగ్గట్లేదు! ఎందుకంటే ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రాలపై పడింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి సందీప్ రెడ్డి వంగాతో చేస్తోన్న ‘స్పిరిట్’ (Spirit) కాగా.. మరొకటి ‘సీతా రామం’ వంటి క్లాసిక్ హిట్‌తో తనని తాను ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘ఫౌజీ’ (Fauzi). రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. భారతదేశ స్వాతంత్ర్య సమయంలో జరిగిన అల్లకల్లోల నేపథ్యంలో.. తిరుగుబాటుదారుడిగా మారిన ఒక బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుడి కథతో హను రాఘవపూడి ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు.
వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 14 లేదా 15వ తేదీలలో.. అంటే ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ సినిమాను విజువల్ వండర్‌లా తెరకెక్కించడానికి, ముఖ్యంగా హై-ఎండ్ వీఎఫ్ఎక్స్‌లో ఎటువంటి లోపాలు లేకుండా పర్ఫెక్ట్‌గా అవుట్‌పుట్ తీసుకురావడానికి టీమ్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక క్రేజీ న్యూస్ గట్టిగా చెక్కర్లు కొడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఫౌజీ’ చిత్రాన్ని 2026 డిసెంబర్ 3వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయాలనే ఆలోచనలో మూవీ టీమ్ ఉందట. అంతేకాదండోయ్.. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే కొన్ని వారాల్లోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ టీజర్‌ను విడుదల చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే వరుసగా సాంగ్స్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే గనుక నిజమైతే.. త్వరలోనే ప్రభాస్ ఇంటర్వ్యూల రూపంలో ఆడియన్స్ ముందుకు రావడం ఖాయం. చాలా రోజుల తర్వాత డార్లింగ్‌ని ఇంటర్వ్యూలలో చూడటానికి అభిమానులు కూడా ఇప్పట్నుంచే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇక ఈ చిత్రం ద్వారా ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ‘ఇమాన్వి’ హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే బాలీవుడ్ దిగ్గజాలు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్‌తో పాటు సీనియర్ నటి జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి స్వాతంత్ర్యం నేపథ్యంలో రాబోతున్న ఈ పీరియడ్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
వంగా ‘స్పిరిట్’ స్కెచ్‌కు బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం!
1.6 కిలోల వెండి ఖడ్గం.. మొక్కు తీర్చుకున్న సీఎం విజయ్!
వారెవ్వా అనిల్ రావిపూడి.. నీ చర్యలు ఊహాతీతం!