Peddi Song: ‘పెద్ది సాంగ్.. బుచ్చి భలే ప్లాన్ చేశాడు..
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:16 AM
దర్శకుడు బుచ్చిబాబు సానా పలు వేదికలపై వరుస అప్‌డేట్‌లతో ‘పెద్ది’ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. గత వారంలో ఓ సినిమా వేదికపై ఫస్ట్ సాంగ్ గురించి అప్‌డేట్ ఇచ్చి ఆసక్తి రేకెత్తించారు.
దర్శకుడు బుచ్చిబాబు సానా పలు వేదికలపై వరుస అప్‌డేట్‌లతో ‘పెద్ది’ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. గత వారంలో ఓ సినిమా వేదికపై ఫస్ట్ సాంగ్ గురించి అప్‌డేట్ ఇచ్చి ఆసక్తి రేకెత్తించారు. ఇప్పుడు మరో అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిత్రీకరణ వేగంగా జరుగుతున్న ఈ సినిమా ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదొక మాంచి లవ్ సాంగ్ అని రెహమాన్ సంగీతం అదరగొట్టేశారని, త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. దాంతో దీపావళికి ఈ పాట వస్తుందని అంతా భావించారు. అయితే పాట విడుదల డిలే అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 8న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సెర్ట్‌లోనే పెద్ది తొలి పాటని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.
ఈ మేరకు దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా హింట్స్ ఇచ్చారు. అయితే ఎ.ఆర్.రెహమాన్ హైదరాబాద్‌లో తన కాన్సెర్ట్ ఉందని ప్రకటించినపప్పటి నుంచి ‘పెది’్ద ఫస్ట్ సాంగ్‌ను ఆ వేదిక మీదే విడుదల చేస్తారని నెటిజన్లు భావించారు. ఇప్పుడు అదే నిజమయ్యేలా ఉంది. క్రికెట్ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతుంది. రామ్ చరణ్, జాన్వీకపూర్ జంటగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.