Peddi - Ram Charan:  పెద్ది కోసం రామ్ చరణ్ ఫిట్‌నెస్‌ మిషన్‌

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:40 AM

పెద్ది సినిమాలో రామ్ చరణ్ కొత్తగా కనిపించనున్నారు. ఆ మేకోవర్ కు సంబంధించిన లుక్ వదిలారు రామ్ చరణ్. ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది 

Peddi - Ram charan

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ (Ram charan) నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ (peddi).  బుచ్చిబాబు సానా దర్శకుడు(Buchibabu sana).  క్రికెట్ నేపథ్యం, మాస్‌,  ఎమోషనల్‌ టచ్‌తో రూపొందుతున్న ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు విశేష స్పందన వచ్చింది. తాజాగా రామ్‌చరణ్‌  వర్కవుట్స్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో  షేర్ చేశారు. అది ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.  

Ram charan.jpeg

'పెద్ది' కోసం ఇలా మారుతున్నాను.. దృఢ సంకల్పం, నిజమైన  ఆనందం” అని కాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో చూస్తే రామ్ చరణ్ పాత్ర కోసం బాగా కష్టపడుతున్నట్లు, రామ్‌చరణ్‌ పూర్తిగా ఓ కొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ లుక్‌ను  ఫ్యాన్స్‌ విపరీతంగా  షేర్ చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.

జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుండగా,  శివరాజ్‌ కుమార్‌, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమా కథ కొన్ని వాస్తవ ఘటనలకు ప్రేరణగా తీసుకుని రూపొందించిన ఫిక్షనల్‌ కథ అని చిత్రబృందం తెలిపింది. క్రికెట్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

Pawan kalyan Press meet: రత్నంగారు నలిగిపోవడం చూడలేక.. పవన్‌ ప్రెస్‌మీట్‌

Kantara surprise glimpse: గ్లింప్స్‌ తో సర్‌ప్రైజ్‌ చేసిన రిషబ్ శెట్టి

Pawan Kalyan: ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఎ.ఎం.రత్నం!


Updated Date - Jul 21 , 2025 | 03:12 PM