Peddi Movie: ట్రైలర్‌లోని ఆ షాట్‌కు.. నీకు గుడి కట్టేయవచ్చు బుచ్చి!

ABN , Publish Date - May 18 , 2026 | 05:28 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబోలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘పెద్ది’. ఈ మూవీ ట్రైలర్‌లోని ఓ షాట్ బాగా వైరల్ అవుతోంది.

Buchibabu and Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) కాంబోలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించి ఫ్యాన్స్ అందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలియంది కాదు. వారి ఎదురు చూపులకు తెరదించుతూ సోమవారం సాయంత్రం ‘పెద్ది’ ట్రైలర్‌ను మేకర్స్ వదిలారు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ దూసుకెళుతోంది. ముఖ్యంగా, ట్రైలర్‌లోని ఒక ప్రత్యేకమైన యాక్షన్ షాట్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. రామ్ చరణ్ అత్యంత ఉద్వేగంతో, తనదైన శైలిలో ప్రత్యర్థిపై దాడి చేస్తున్నట్లుగా ఉన్న ఈ సన్నివేశం సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది.


ట్రైలర్ అంతా ఒక ఎత్తు, లాస్ట్‌లో వచ్చే ఈ ట్రాన్సిషన్ షాట్ మరో ఎత్తు అనేలా ఫ్యాన్స్, నెటిజన్లు రియాక్ట్ అవుతుండటం విశేషం. క్రికెటర్ ‌నుంచి కుస్తీ యోధుడిగా మారడం మాత్రం హైలెట్ అంటూ.. బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు, ఈ షాట్‌కు నీకు గుడి కూడా కట్టేయవచ్చు బుచ్చి అంటూ ఫ్యాన్స్ కొందరు తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. రామ్ చరణ్ ఇంటెన్స్ లుక్, అతని శారీరక భాష, యాక్షన్ కొరియోగ్రఫీ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ట్రైలర్‌లోని చాలా వరకు షాట్స్.. బుచ్చి బాబు సానా దర్శకత్వ ప్రతిభను కొనియాడేలా చేస్తున్నాయి.


ఇక ఈ ట్రైలర్‌తో అంచనాలు అమాంతం రెట్టింపవుతున్నాయి. ‘పెద్ది’ సినిమా కచ్చితంగా టాలీవుడ్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఒక్కో పాత్రను టైటిల్‌లో రివీల్ చేసిన తీరు, రామ్ చరణ్ మేకోవర్.. అన్నీ వావ్ అనేలా ఉన్నాయి. క్రికెట్, కుస్తీ కాకుండా ట్రైలర్ చివరిలో రామ్ చరణ్ పాత్రలోని మరో కోణాన్ని దర్శకుడు పరిచయం చేశారు. ఆ పాత్ర ఈ సినిమాకు ప్రాణమనే భావనని ఈ ట్రైలర్ కలగజేస్తోంది. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.

ఇవి కూడా చదవండి:

నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు: జయం రవికి భార్య ఆర్తి కౌంటర్!

కోహ్లీ కుస్తీ ఆడితే ఎలా ఉంటదో.. ‘పెద్ది’ ట్రైలర్‌పై నాగవంశీ

మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!

Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!

Updated Date - May 18 , 2026 | 05:32 PM

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Peddi First Shot: రామ్ చరణ్ చెప్పినట్టే ఫస్ట్ షాట్ అదిరింది

Peddi Movie: రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ.. వీడియో వైరల్!

Peddi Movie: ముంబైలో ట్రైలర్ లాంచ్.. ఆ వెంటనే భోపాల్‌లో.. ఆట మొదలైంది!

Peddi Movie: ‘పెద్ది’ విషయంలో బుచ్చిబాబు స్ట్రాటజీ ఏంటి? ఓన్లీ రామ్ చరణేనా!