సినీ ప్రయాణంలో 48 వసంతాలు.. మెగాస్టార్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:56 PM

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినీ రంగ ప్రవేశం చేసి నేటితో 48 ఏళ్లు పూర్తయ్యాయి.

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినీ రంగ ప్రవేశం చేసి నేటితో 48 ఏళ్లు పూర్తయ్యాయి. 1978 సెప్టెంబరు 22న ప్రాణం ఖ‌రీదు (Pranam Khareedu) సినిమా విడుద‌ల‌తో ప్రారంభమైన తన నట ప్రస్థానంపై ఆయన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పాత్రలు పోషించానని, ఎన్నో విజయాలు, అవార్డులు అందుకున్నానని గుర్తుచేసుకున్నారు. తనను నమ్మి అవకాశాలు ఇచ్చిన నిర్మాతలు, కొత్త కోణాల్లో ఆవిష్కరించిన దర్శకులు, సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Chiranjeevi

అన్నింటికంటే మిన్నగా ప్రేక్షకులు తనపై చూపిన అపారమైన ప్రేమే గొప్పదని, కుటుంబ సభ్యుడిగా భావించి గుండెల్లో స్థానం ఇచ్చిన అభిమానులకే ఈ ఘనత దక్కుతుందని పేర్కొన్నారు. నాడు తాను పెట్టుకున్న ‘చిరంజీవి’ అనే పేరు.. నేడు అభిమానుల ప్రేమాభిమానాలతో శాశ్వత గుర్తింపుగా మారిందని చిరంజీవి పేర్కొన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 02:52 PM