సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విజయ్ విడాకుల కేసులో తాజా అప్డేట్ ఇదే!

ABN, Publish Date - Apr 20 , 2026 | 05:21 PM

ఒక వైపు ఎన్నికల హడావుడి, మరోవైపు భార్యతో విడాకుల కేసు.. మొత్తంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ పేరు నిత్యం ఏదో ఒక రకంగా వార్తలలో నిలుస్తూనే ఉంది. ప్రస్తుతం విజయ్ ఎన్నికల ప్రచారంలో ఎలా దూసుకెళుతున్నారో తెలియంది కాదు.

Vijay and Sangeeth Divorce Case Update

ఒక వైపు ఎన్నికల హడావుడి, మరోవైపు భార్యతో విడాకుల కేసు.. మొత్తంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ (Kollywood Star Hero Vijay) పేరు నిత్యం ఏదో ఒక రకంగా వార్తలలో నిలుస్తూనే ఉంది. ప్రస్తుతం విజయ్ ఎన్నికల ప్రచారంలో ఎలా దూసుకెళుతున్నారో తెలియంది కాదు. ఫస్ట్ టైమ్ ఎన్నికల ప్రచారానికి సరికొత్త టెక్నాలజీని వాడుతూ, అందరి దృష్టిలో పడుతున్నారు. అదే టైమ్‌లో భార్య సంగీత (Vijay Wife Sangeetha)తో విడాకుల వ్యవహారం కూడా హాట్ టాపిక్ అవుతూ, విజయ్ గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. ఈ క్రమంలో విజయ్, సంగీత విడాకుల కేసు నిమిత్తం సోమవారం విచారణ జరగనున్న క్రమంలో, అసలేం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ విచారణకు సంబంధించిన తాజా అప్డేట్ వచ్చేసింది.


విజయ్, సంగీతల విడాకుల కేసు (Vijay and Sangeetha Divorce Case) వాయిదా పడింది. ఈ కేసును జూన్ 15కు వాయిదా చేస్తూ.. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని విజయ్, సంగీతకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో భరణం కింద రూ. 250 కోట్లను సంగీత డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ మాత్రం రూ. 35 కోట్లు ఆమెకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, పిల్లలిద్దరినీ తనే చూసుకుంటానని చెబుతున్నట్లుగా కూడా టాక్ నడుస్తోంది. ఏ విషయం జూన్ 15న జరిగే విచారణతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు వీరి విడాకుల కేసులో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కోర్టు ఫైనల్‌గా ఎలాంటి తీర్పును ఇస్తుందనేది తెలియాలంటే మాత్రం జూన్ 15 వరకు వెయిట్ చేయాల్సిందే.


విజయ్ పొలిటికల్ ఎంట్రీ అనంతరం, ఆయన జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు. మరోవైపు సినిమా లీక్ అవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పర్సనల్ లైఫ్‌లోనూ ఆయనపై అనేక ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్ త్రిషతో ఆయన రిలేషన్‌లో ఉన్నారనేలా వార్తలు రావడం, ఆ వెంటనే భార్య విడాకుల నిమిత్తం కోర్టును ఆశ్రయించడం.., అదే టైమ్‌లో త్రిషతో కలిసి విజయ్ ఓ పెళ్లికి హాజరవడం.. ఇలా ఆయన పర్సనల్ లైఫ్‌ కూడా గందరగోళంగా మారింది. రాజకీయంగానూ ఆయనపై కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆయన పొలిటికల్ పార్టీ ప్రకటించినప్పటి నుంచి ఇలా, ఏదో రకంగా విజయ్ టార్గెట్‌ అవుతూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

అప్పటి వరకూ నాకు విశ్రాంతి లేదు: పవన్ కళ్యాణ్ విష్‌కు చంద్రబాబు స్పందనిదే!

సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!

సబ్‌స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!

Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!

Updated Date - Apr 20 , 2026 | 05:21 PM