సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!

ABN , Publish Date - Apr 19 , 2026 | 09:54 PM

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని సెలబ్రిటీలు చాలా మంది చెబుతుంటారు. ఎక్కువగా ఈ మాటే వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ మారింది.. ‘కోడింగ్ చేయాల్సిన వాళ్లం.. కెమెరా ముందుకు వచ్చాం’ అని చెప్పుకుంటున్నారు కొందరు సెలబ్రిటీలు.

celebrities who left software jobs

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని సెలబ్రిటీలు చాలా మంది చెబుతుంటారు. ఎక్కువగా ఈ మాటే వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ మారింది.. ‘కోడింగ్ చేయాల్సిన వాళ్లం.. కెమెరా ముందుకు వచ్చాం’ అని చెప్పుకుంటున్నారు కొందరు సెలబ్రిటీలు. వాస్తవానికి సినీ రంగానికి, సాఫ్ట్‌వేర్ రంగంతో పోలిక పెట్టడం కష్టమే అయినా, నేటి తరం నటులు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం, లేదా ఒకదాన్ని వదిలి మరో దానిలోకి రావడం అనేది ఒక ఆసక్తికరమైన ట్రెండ్‌గా మారింది. ఐటి రంగంలో స్థిరపడి, మంచి సంపాదన ఉన్నప్పటికీ, తమ కల కోసం ఆ ఉద్యోగాలను వదిలి, నేడు వెండితెరపై సూపర్ స్టార్లుగా ఎదిగిన నటీనటులు ఎందరో ఉన్నారు. వీరిలో మనకు ముందుగా గుర్తొచ్చే పేరు మాత్రం శేఖర్ కమ్ముల (Sekhar Kammula)దే. హీరో సత్యదేవ్ (Satyadev) కూడా ఇదే జాబితాకు చెందిన వారు. ఇప్పుడీ లిస్ట్‌లోకి కొత్తగా చేరిన నటీనటుల విషయానికి వస్తే..


శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty): ‘కెజియఫ్’ చిత్రంతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ నటి, అంతకుముందు ప్రముఖ ఐటి సంస్థ ‘యాక్సెంచర్ (Accenture)’లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఈ భామ చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు.

నివిన్ పౌలీ (Nivin Pauly): మలయాళ చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నివిన్ పౌలీ, అంతకుముందు ‘ఇన్ఫోసిస్ (Infosys)’లో ఉద్యోగిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత జాబ్‌కు రిజైన్ చేసి, సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఆయన స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

కయదు లోహర్ (Kayadu Lohar): ఈ భామ పేరు ఈ మధ్యకాలంలో బాగా వినబడుతోంది. ‘పాతాళ్ లోక్’ వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా పాపులర్ అయిన కయదు లోహర్, ‘కాన్సెంట్రిక్స్ (Concentrix)’ అనే మల్టీనేషనల్ కంపెనీలో పనిచేశారు. ప్రస్తుతం ఈ భామ కూడా చేతినిండా సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారారు.


టోవినో థామస్ (Tovino Thomas): మలయాళ చలనచిత్ర రంగానికి చెందిన మరో వర్సటైల్ యాక్టర్ టోవినో థామస్. ‘కాగ్నిజెంట్ (Cognizant)’లో ఉద్యోగం చేస్తూనే నటనపై తనకున్న ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడీ హీరో డిమాండ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే.

అనన్య నాగళ్ల (Ananya Nagalla): తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమైన పేరు అనన్య నాగళ్ల, అంతకుముందు ‘ఇన్ఫోసిస్ (Infosys)’లో పనిచేస్తూనే తన నటనతో సినిమా రంగంలో నిరూపించుకున్నారు.

బేసిల్ జోసెఫ్ (Basil Joseph): నటుడు, దర్శకుడిగా మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన బేసిల్ జోసెఫ్. ఈయన సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. త్వరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని బేసిల్ డైరెక్ట్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈయన విషయానికి వస్తే.. బేసిల్ జోసెఫ్ కూడా ‘ఇన్ఫోసిస్ (Infosys)’ నుంచి వచ్చినవారే.

వీరే కాదు.. ఇంకా ఎంతో మంది ఉన్నారు. వీరందరి సక్సెస్ స్టోరీలు గమనిస్తే.. ఆసక్తి, పట్టుదలతో కష్టపడి పని చేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని నిరూపించారు. సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఐటి ఉద్యోగులందరికీ వీరు స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పడంలో సందేహమే లేదు.

ఇవి కూడా చదవండి:

సబ్‌స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!

SIFPA: ఏకపక్ష నిర్ణయాలకు చెక్.. సినీ పరిశ్రమను కాపాడుకునే దిశగా నిర్మాతలు!

Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!

పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?

Updated Date - Apr 19 , 2026 | 09:54 PM