Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!
ABN , Publish Date - Apr 18 , 2026 | 09:30 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘నిజం’ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రాశి కనిపించారు. ఆ సినిమా విడుదలైన తర్వాత రాశిపై చాలా విమర్శలు వచ్చాయి.
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు హీరోయిన్ రాశి (Raasi) చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. అప్పటి వరకు హీరోయిన్‌గా తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకెళుతున్న రాశి.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘నిజం’ (Nijam) చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. ఆ సినిమా విడుదలైన తర్వాత రాశిపై చాలా విమర్శలు వచ్చాయి. నటి అన్నాక.. అన్ని పాత్రలు చేయాలి. కానీ, ‘నిజం’ సినిమాలో చేసిన పాత్రకు అలాంటి విమర్శలు వస్తాయని ఊహించలేదు అని తెలిపారు రాశి. తాజాగా ఆమె రీ ఎంట్రీలో నటించిన చిత్రం ‘పాపం ప్రతాప్’ (Papam Prathap) థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాశి మాట్లాడుతూ..
‘‘ఎలాంటి సినిమాలు చేయాలి? ఎలాంటి పాత్రలు చేయాలి? అనేది నేను డిసైడ్ చేయడం కాదు, ఈ సినిమా డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి.. మిమ్మల్ని అనుకునే ఈ పాత్ర రాశాను అని చెప్పారు. అలా నాకు చెప్పినప్పుడు, నాకు నచ్చితే కచ్చితంగా చేస్తాను. ఇది కేవలం పాజిటివ్ లేదా నెగిటివ్ క్యారెక్టర్ గురించి కాదు. ఒక ఆర్టిస్ట్‌గా అన్ని రకాల జోనర్స్ చేయాలి, ఒకటే చేస్తామని కూర్చోకూడదు. సో, ‘నిజం’ సినిమా కూడా నేను అలాగే ఆలోచించి చేశాను. అది అంత నెగిటివిటీ అవుతుందని నేను ఎక్స్‌ఫెక్ట్ చేయలేదు. అందుకు సారీ చెబుతున్నాను, బట్ ఇక మీదట ఫర్దర్‌గా నెగిటివ్ అయినా, పాజిటివ్ అయినా చేస్తాను, కాకపోతే అది ఆడియన్స్‌కు యాక్సెప్టబుల్‌గా ఉండాలి’’ అని రాశి క్లారిటీ ఇచ్చారు.
ఇక ‘పాపం ప్రతాప్’లోని తల్లి పాత్ర గురించి చెబుతూ.. ‘‘పాప ఎపిసోడ్‌లో ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు నేను అక్కడ లేను, కేవలం నా వాయిస్ ఓవర్ ఉంటుంది తప్ప నేను ఆ ఇన్సిడెంట్‌లో లేను. సో నాకు పాప పాత్ర ఎక్కువగా కనెక్ట్ అవ్వలేదు. నాకు తిరువీర్ ఒక కొడుకులా కనెక్ట్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు నాకు కూతుర్ల కంటే కొడుకులు ఎక్కువ అవుతున్నారు. అందరూ హీరో మదర్, హీరో మదర్, హీరో మదర్.. సో ఒక్కొక్కరుగా నేను నా కొడుకుల సంఖ్యను పెంచుకుంటున్నాను. ఈ సినిమాలో తిరువీర్ నటనకు 99 మార్కులు వేసేయవచ్చు. 99 చాలా ఇంపార్టెంట్, 100 కాదు..’’ అంటూ సరదాగా చమత్కరించారు.
ఇవి కూడా చదవండి:
పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?
విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.
మంగ్లీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!