సబ్‌స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!

ABN , Publish Date - Apr 19 , 2026 | 08:00 PM

ఇటీవల యాంకర్, నటి విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో సబ్‌స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా, ఆమెపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె బాటలోనే అనన్య నాగళ్ల కూడా నడుస్తుందనే వార్తలపై తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు.

Ananya Nagalla

ఇటీవల యాంకర్, నటి విష్ణుప్రియ (Vishnu Priya) తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో సబ్‌స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా, ఆమెపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారి కోసం ఆమె స్పెషల్‌గా వీడియోలు, ఫొటోలు పెడుతూ, డబ్బు సంపాదిస్తుందని, తద్వారా కుర్రాళ్లను తప్పుదోవ పట్టిస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో ఆమె పోలీసుల విచారణను సైతం ఎదుర్కొంటున్నారు. ఇప్పుడామె బాటలోనే తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా సబ్‌స్క్రిప్షన్ అంటూ తెగ హడావుడి చేస్తోన్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, ఆమె పేజీకి వెళ్లి చూస్తే, ఆ ఆప్షన్ కనిపించడం లేదు. దీంతో వ్యవహారమంతా గందరగోళంగా మారింది. ఈ విషయంలో తనని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని భావించిన అనన్య నాగళ్ల (Ananya Nagalla).. తాజాగా తన ఇన్‌స్టా వేదికగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.


‘‘నేను ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా నా అభిమానులకు, ప్రజలకు దగ్గర కావడం కోసం మాత్రమే నేను ఈ ఆప్షన్ ఎంచుకున్నాను తప్పితే, ఇతరత్రా వాటి కోసం కాదు. ఈ ఆప్షన్ ద్వారా నా జీవితంలో నాకు జరిగినవి, జరుగుతున్నవి ప్రజలకు తెలియజేసి నాకు తోచిన విధంగా అందరికీ సహాయపడాలనే సదుద్దేశంతోనే నేను సబ్‌స్క్రిప్షన్ ఎంచుకున్నాను. ఈ సబ్‌స్క్రిప్షన్ పెట్టినప్పుడే నేను ఏమనుకున్నానంటే.. రెగ్యులర్‌గా అందరితో కాంటాక్ట్‌లో ఉండాలి, కనెక్ట్ అవ్వాలి.. అలాగే ఒకరికొకరం కమ్యూనిటీ‌గా ఉంటూ గ్రో అవ్వాలనేది నా ఉద్దేశ్యం. నాకు లైఫ్‌లో యూస్‌ఫుల్ అయిన ఎక్స్‌పీరియన్సెస్, ప్రాక్టీసెస్, నా డైలీ రొటీన్ మీతో షేర్ చేయాలి. అండ్ మీ దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలని నేను అనుకున్నాను. అంతేకాదు, ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా వచ్చిన అమౌంట్‌తో మంత్లీ సొసైటీకి ఏదైనా చిన్న హెల్ప్ చేద్దామనేది నా మోటో’’ అని చెప్పుకొచ్చారు.


ఇంకా ఈ వీడియోలో ఆమె ఓ టిప్ కూడా చెప్పారు. ‘ఓం నమః శివాయ’ అనే మంత్రాన్ని 21 డేస్ 108 టైమ్స్ డైలీ జపిస్తే, మనకే తెలియకుండా మనకి చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందని, యాంగ్జైటీ తగ్గుతుందని, మెంటల్లీ కామ్ అయిపోతుందని ఆమె ఇందులో తెలిపారు. ఇలాంటి విషయాలతో పాటు, నా షూటింగ్స్‌కు సంబంధించి కొన్ని ఎక్స్‌క్లూజివ్ విశేషాలు తెలిపేందుకే సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ తీసుకున్నట్లుగా అనన్య నాగళ్ల క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

SIFPA: ఏకపక్ష నిర్ణయాలకు చెక్.. సినీ పరిశ్రమను కాపాడుకునే దిశగా నిర్మాతలు!

Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!

పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?

విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.

Updated Date - Apr 19 , 2026 | 08:03 PM

Ananya Nagalla: అనన్య నాగళ్లచే  వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్

Ananya Nagalla : ఇక్కడ ఉండాలంటే తప్పదు మరి..

Ananya Nagalla: అన‌న్య నాగ‌ళ్ల‌.. కుర్రాళ్ల గ‌తేం కాను

Ananya Nagalla: ఎవర్రా మృణాల్.. బ్యాక్ చూపించి అల్లాడిస్తున్న తెలుగమ్మాయి

Ananya Nagalla: నచ్చితే లైక్‌ కొట్టండి.. లేదా సైలెంట్‌గా ఉండండి