Thalapathy Vijay: అబ్బే.. బాలయ్య హుందాతనం విజయ్ కి రాలేదబ్బా

ABN , Publish Date - Jan 04 , 2026 | 01:18 PM

రీమేక్ సినిమాల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక భాషలో హిట్ అయిన సినిమాలను తమ నేటివిటీకి తగ్గట్లు మార్చుకొని వేరే భాషలో హీరోలు రీమేక్ చేస్తారు.

Thalapathy Vijay

Thalapathy Vijay: రీమేక్ సినిమాల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక భాషలో హిట్ అయిన సినిమాలను తమ నేటివిటీకి తగ్గట్లు మార్చుకొని వేరే భాషలో హీరోలు రీమేక్ చేస్తారు. కొంతమంది సినిమాను మొత్తం కాపీ పేస్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఆ సినిమాలోని లైన్ ని మాత్రమే తీసుకొని.. వారికి నచ్చినట్లు తీస్తారు. కొన్నిసార్లు ఒరిజినల్స్ హిట్ అవుతాయి.. మరికొన్నిసార్లు రీమేక్స్ హిట్ అవుతాయి. అయితే రీమేక్ అంటే కేవలం కథతో మాత్రమే పోల్చరు. స్టార్ హీరోలు రీమేక్ చేస్తే వారి నటన, ఇంటెన్సీటీ.. మరో హీరో మ్యాచ్ చేశాడా.. ? లేదా అనేది కూడా చూస్తారు. ఇప్పుడు అలాంటి పోలికనే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దళపతి విజయ్ (Thalapathy Vijay) మధ్య వచ్చింది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయకుడు. హెచ్ వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్స్ గా నటిస్తుండగా.. బాబీ డియోల్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఎప్పటి నుంచో ఈ సినిమా.. తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు మేకర్స్ మాత్రం ఇది అధికారిక రీమేక్ అని చెప్పకపోవడంతో ఫ్యాన్స్ అందరూ సైలెంట్ గా ఉన్నారు. అయితే నిన్న ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో అప్పటి నుంచి జన నాయకుడు కన్ఫర్మ్ భగవంత్ కేసరి రీమేక్ అని తేల్చి చెప్పేస్తున్నారు.

జన నాయకుడు ట్రైలర్ సగం వరకు భగవంత్ కేసరి సినిమాను మక్కీకి మక్కి దింపేసారు. డైలాగ్స్, ఫైట్స్.. సాంగ్స్ ఇలా ప్రతిదీ రీమేక్ అని తెలుస్తుంది. ఇక మధ్యలో బాబీ డియోల్ దిగాకా కథ మారినట్లు తెలుస్తోంది. మమితా భయపడడానికి.. విలన్ కి ఏదో సంబంధం ఉందని, అదేంటో తెల్సితే దేశాన్ని కాపాడొచ్చని విజయ్ చెప్పడంతో ఈ సినిమాలోని కథను కొద్దిగా మార్చినట్లు తెలుస్తోంది. కథ గురించి పక్కన పెడితే.. భగవంత్ కేసరిలో ఉన్న ఎమోషన్స్, ఇంటెన్సిటీ జన నాయకుడు లేదు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

భగవంత్ కేసరిలో తండ్రి- కూతుళ్ళ మధ్య ఉండే బాండింగ్, ఎమోషన్ అంతా చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఈ సినిమాలో ఎక్కడా బాలయ్య ఇంటెన్సిటీ తగ్గలేదు. హుందాగా ప్రతి తండ్రి ఎలా ఉంటాడో అలాగే కనిపిస్తాడు. ఆ లుక్ కానీ, సెటిల్డ్ యాక్టింగ్ కానీ.. విలన్స్ కి వార్నింగ్ ఇచ్చే విధానం కానీ, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే ఇది జన నాయకుడులో కనిపించలేదని తెలుగు ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. విజయ్ నార్మల్ గా.. అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడిలానే ఇందులో కనిపించాడు. ఆ ఇంటెన్సిటీ కనిపించలేదని చెప్పుకొస్తున్నారు. కనీసం పూర్తి కథను రీమేక్ చేసినా.. బాలయ్యలా విజయ్ చేశాడా.. ? లేదా.. ? అని అభిమానులు చూసేవారేమో. ఇక్కడ అది కూడా జరగలేదు. దీంతో బాలయ్యను విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడు అని పెదవి విరుస్తున్నారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక విజయ్ ఎన్ని మార్కులు కొట్టేస్తాడా చూడాలి.

Updated Date - Jan 04 , 2026 | 01:41 PM