Thalapathy Vijay: 23 ఏళ్ల తర్వాత విడాకులు!?.. సన్నిహితుల రియాక్షన్
ABN , First Publish Date - 2023-01-06T13:45:41+05:30 IST
తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay). సంక్రాంతి సందర్భంగా ‘వారసుడు’ (Varasudu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay). సంక్రాంతి సందర్భంగా ‘వారసుడు’ (Varasudu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ తరుణంలో విజయ్ వివాహ జీవితం (Marriage Life) గురించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కొన్ని రోజుల నుంచి విజయ్ తన భార్య సంగీత(Sangeetha)తో విడాకుల తీసుకునేందుకు సిద్ధమవ్వుతున్నాడని ప్రచారం జరుగుతోంది.
ఈ తరుణంలోనే విజయ్ ‘వారసుడు’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి, అలాగే అట్లీ భార్య సీమంతానికి విజయ్‌తో సంగీత కలిసి రాలేదు. దీంతో ఆ వార్తలు నిజమేనని ప్రచారం ఊపందుకుంది. దీనిపై విజయ్ సన్నిహితులు మాట్లాడుతూ.. ‘విజయ్, సంగీత విడాకులు తీసుకుంటున్నారనేది అబద్ధం. ఆ వదంతులు నిరాధారమైనవి. సంగీత ప్రస్తుతం పిల్లలతో పాటు విహారయాత్రలో ఉంది. అందువల్ల ఏ ఈవెంట్‌లకు హాజరు కాలేదు. ఈ రూమర్స్ ఎలా మొదలయ్యాయో మాకు తెలియట్లేదు’ అని చెప్పుకొచ్చారు. అయితే.. ఈ వార్తలపై విజయ్ మాత్రం అధికారికంగా స్పందించలేదు.
కాగా.. విజయ్‌కి సంగీత చాలా పెద్ద అభిమాని. అందుకే ఆయన్ని కలవడానికి యూకే నుంచి చెన్నై వచ్చింది. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారింది. అనంతరం సంగీతని విజయ్ తన కుటుంబ సభ్యులకి పరిచయం చేశాడు. వీరికి ఆగష్టు 25, 1999న వివాహం జరిగింది. వారికి కుమారుడు జాసన్ సంజయ, కుమార్తె దివ్య ఉన్నారు.