‘జననాయగన్’ విడుదలయ్యేది ఆ రోజేనా?
ABN , Publish Date - May 10 , 2026 | 03:05 PM
హెచ్. వినోద్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన కొత్త చిత్రం ‘జననాయగన్’. జనవరిలో సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ వివాదం కారణంగా ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు.
హెచ్. వినోద్ దర్శకత్వంలో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన కొత్త చిత్రం ‘జననాయగన్’ (Jana Nayagan). జనవరిలో సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ వివాదం కారణంగా ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రిలీజ్ తేదీపై కోలీవుడ్‌లో సరికొత్త ప్రచారం సాగుతోంది. జూన్ 22న హీరో విజయ్ తన 53వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఆ రోజున విజయ్ బర్త్‌డే స్పెషల్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత వెంకట్ కె.నారాయణ (Venkat K Narayana) భావిస్తున్నట్టు సమాచారం. మరో వైపు ఈ నెల 28న ఈ చిత్రం విడుదలకావొచ్చని చెబుతున్నారు.
మరి ఈ రెండు తేదీలలో ఏ రోజున సినిమా విడుదల అవుతుందనేది మాత్రం మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. త్వరలోనే మూవీ విడుదలపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా కేవీఎన్ ప్రొడక్షన్ పతాకంపై రూపొందిన చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు నటించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా శనివారం విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి (Tamil Nadu CM) తనే కాబట్టి.. ‘జననాయగన్’ విడుదలకు ఇక అడ్డంకులు ఏర్పడే అవకాశమే లేదని ఫిక్స్ అయిపోవచ్చు.
ఇంతకు ముందు అడుగడుగునా ఈ సినిమాకు అడ్డంకులే ఏర్పడ్డాయి. ఆ అడ్డంకులే విజయ్‌పై ప్రేక్షకులలో, ప్రజలలో సానుభూతి ఏర్పడేలా చేశాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడన్నీ కలిసొచ్చి, రాష్ట్ర అధికారాన్నే చేజిక్కించుకున్నారు విజయ్. మరి ఆయన నటించిన చివరి చిత్రం థియేటర్లలో ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
ఇవి కూడా చదవండి:
‘అండర్ రేటెడ్’ నటిగా చూస్తున్నారా? పాయల్ రాజ్‌ఫుత్ సమాధానమిదే!
Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!
త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి
Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!