Jana Nayagan First Song: దళపతి కచేరి.. అనిరుధ్ గట్టిగా వాయించేశాడు
ABN , Publish Date - Nov 08 , 2025 | 07:39 PM
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇంకోపక్క అభిమానులను అలరించడానికి చివరి సినిమాగా జన నాయగన్(Jana Nayagan) తో రాబోతున్నాడు.
Jana Nayagan First Song: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇంకోపక్క అభిమానులను అలరించడానికి చివరి సినిమాగా జన నాయగన్(Jana Nayagan) తో రాబోతున్నాడు. హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజ్జయి సరసన పూజా హెగ్డే(Pooja Hegde) నటిస్తుండగా.. మమితా బైజు (Mamitha Baiju) కీలక పాత్రలో నటిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం తెలుగులో సూపర్ హిట్ అయిన నేలకొండ భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా జన నాయగన్ తెరకెక్కింది. అయితే పూర్తిగా రీమేక్ లా కాకుండా ఆ లైన్ తీసుకొని దానికి తమిళ్ నేటివిటీని యాడ్ చేసి కొత్త సినిమాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9 న రిలీజ్ కానుంది. ఈ మధ్య విజయ్ ప్రచారంలో జరిగిన విషాదం వలన జన నాయగన్ వాయిదా పడుతుందేమో అనుకున్నారు. కానీ, రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. అందులో భాగంగానే సినిమాలోని మొదటి సింగిల్ ను రిలీజ్ చేశారు. దళపతి కచేరి అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
అనిరుధ్ మరోసారి డ్యూటీ ఎక్కినట్లు కనిపిస్తుంది. విజయ్ - అనిరుధ్ డెడ్లీ కాంబో. ఈసారి కూడా విజయ్ సినిమాకు గట్టిగానే వాయించాడు. ఇక విజయ్ చివరి చిత్రం కావడంతో అభిమానులను ఎక్కడా నిరాశపర్చకుండా డ్యాన్స్ అదరగొట్టేశాడు. సాంగ్ లో పూజా హెగ్డే అందం హైలైట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. మమితా లుక్ కూడా కొంచెం మాస్ గా కనిపిస్తుంది. మొత్తానికి మొదటి సాంగ్ తో మంచి పాజిటివ్ టాక్ ను అందుకున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ చివరిగా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Mystery: ఓటీటీలో.. ఆకట్టుకుంటున్న ‘మిస్టరీ’
Akkineni Nagarjuna: బిగ్ బాస్ స్టేజిపై నాగ్ తో అమల డ్యాన్స్..