Jana Nayagan: విజయ్‌ చివరి సినిమా అనడం బాధగా ఉంది.. సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేశా..

ABN , Publish Date - Dec 12 , 2025 | 07:35 PM

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ నటిస్తున్న చిత్రం ‘జన నాయగన్‌’ (Jananayagan). దీనికి అనిరుద్థ్‌ సంగీతం (anirudh) అందిస్తున్న సంగతి తెలిసిందే! హెచ్‌.వినోద్‌ (H Vinod) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది.

vijay


కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ నటిస్తున్న చిత్రం ‘జన నాయగన్‌’ (Jananayagan). దీనికి అనిరుద్థ్‌ సంగీతం (anirudh) అందిస్తున్న సంగతి తెలిసిందే! హెచ్‌.వినోద్‌ (H Vinod) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. పూజాహెగ్డే కథానాయిక. డిసెంబర్‌ 27న మలేషియాలో భారీ ఎత్తున ఆడియో ఫంక్షన్‌ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌, చిత్రం గురించి అనిరుధ్థ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇటీవల ఈ చిత్రంలోని మొదటి పాట ‘దళపతి కచేరి’ను లాంచ్‌ చేశారు. ఆ పాట చక్కని ఆదరణ పొందం ఆనందంగా ఉందని తెలిపారు.  ‘మలేషియాలో ఆడియో ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు. అభిమానులకు ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉంటాయి.   ఓపెన్‌ స్టేడియంలో ఈ ఈవెంట్‌ జరగనుంది. నేను కూడా విజయ్‌ కోసం ఒక సర్‌ప్రైజ్‌ ప్ల్లాన్‌ చేశాను. కానీ, ఈ సినిమా ఆయనకు చివరిది కావడం నాకు చాలా బాధగా ఉంది. విజయ్‌ ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఈ ఈవెంట్‌లో ఆయనను ఆశ్చర్యపరుస్తాను. ఆయన నటించిన ‘మాస్టర్‌’, ‘లియో’, ‘బీస్ట్‌’ చిత్రాల్లోని పాటలతోపాటు ‘జన నాయగన్‌’లోని పాటలు కూడా లైవ్‌లో ప్రదర్శించనున్నా’’ అని అనిరుధ్‌ అన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 09:44 PM