Jana Nayagan: తన రికార్డును తానే బ్రేక్ చేసిన విజయ్
ABN , Publish Date - Dec 19 , 2025 | 06:20 PM
ఇది విజయమా... విధ్వంసమా అని విజయ్ సినిమా ప్రీ-రిలీజ్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోతోంది తమిళ ఇండస్ట్రీ. విజయ్ తన రికార్డును తానే బద్దలుకొట్టుకోవడం చూసి సంభ్రమకు లోనవుతోంది.
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ కెరీర్ లో చివరిగా చేస్తున్న మూవీ 'జన నాయగన్'. జనవరి 9న పొంగల్ కానుకగా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అయితే విజయ్ చివరి సినిమా అన్న అభిమానమో లేక మూవీ ప్రమోషన్స్ కు అట్రాక్ట్ అయ్యారా అనేది తెలియదు కానీ అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ విషయంలో హిస్టరీ క్రియేట్ చేస్తోందీ సినిమా. ముందస్తుగా అమ్ముడవుతున్న టికెట్ల సంఖ్య చూస్తోంటే మతిపోయేలా ఉంది.
యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన మొదటి 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 12, 800కు పైగా టికెట్లు సోల్డ్ అవుట్ కావడం ఇండ్రస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు విజయ్ 'లియో' చిత్రం 10, 200 టికెట్లతో ఈ రికార్డు సృష్టించగా, ఇప్పుడు 'జన నాయగన్' దాన్ని అవలీలగా దాటేసింది.
'జననాయగన్' మూవీని ప్రముఖ దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్నాడు. దీన్ని పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడు. విజయ్ ఈ సినిమాలో నిజాయితీ గల పోలీసు అధికారిగా కనిపించబోతున్నాడు. సమాజంలోని అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతూ రాజకీయాల్లోకి అడుగుపెట్టే పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన పాటలు అద్భుతమైన ఆదరణ పొంది, సినిమా మీద భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ను క్రియేట్ చేశాయి. తాజా బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే, దళపతి ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకు ఒక ఎపిక్ ఫేర్‌వెల్ ఇవ్వాలని గట్టిగా నిశ్చయించుకున్నట్టు కనిపిస్తోంది.
Read Also: BMW Teaser: వదినోళ్ల చెల్లి అంటే నా వైఫేగా.. ఆసక్తిగా టీజర్
Read Also: Chiranjeevi: ఎవర్రా ఈ కుర్రాడు.. రామ్ చరణ్ కి తమ్ముడా!