రూ.100 కోట్ల క్లబ్లో ‘మండాడి’
ABN , Publish Date - Sep 23 , 2026 | 09:34 AM
సూరి హీరోగా నటించిన తాజా చిత్రం మండాడి ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది.
సూరి (Soori) హీరోగా నటించిన తాజా చిత్రం మండాడి (Mandadi) ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్మంట్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది.
'మండాడి' ప్రాంచైజీకి ఇది గొప్ప విజయత్సోమైన రోజు. ఈ యేడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'మండాడి' బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్ల మార్కును అధిగమించింది. అన్ని ప్రాంతాల్లో విజయం సాధించింది, ఇది ప్రేక్షకుల విజయం.
కాగా, ఈ నెల 10వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి మదిమారన్ పుగళేంది (Mathimaran Pugazhendhi) దర్శకుడు. మహిమా నంబియార్ (Mahima Nambiar), సుహాన్ (Suhas), సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు నటించారు.
సముద్రంలో పడవ పోటీల నేపథ్యంలో తీరప్రాంత ప్రజల జీవన సంప్రదాయాలు, భావోద్వేగాలు, పట్టుదల వంటి అంశాలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుని రూ.వంద కోట్ల కలెక్షన్ మూవీ క్లబ్‌లో చేరింది.