తన తొలి సినిమా హీరో విజయ్ పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్!
ABN, Publish Date - May 11 , 2026 | 07:59 PM
గ్లోబల్ స్టార్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా సినీ ప్రస్థానం దక్షిణాది నుండే మొదలైందన్న విషయం చాలామందికి ఆసక్తిని కలిగిస్తుంది. ఆమె వెండితెరకు పరిచయమైంది కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ‘తమిజన్’ (2002) చిత్రంతోనే.
గ్లోబల్ స్టార్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సినీ ప్రస్థానం దక్షిణాది నుండే మొదలైందన్న విషయం చాలామందికి ఆసక్తిని కలిగిస్తుంది. ఆమె వెండితెరకు పరిచయమైంది కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ‘తమిజన్’ (2002) చిత్రంతోనే. ప్రస్తుతం విజయ్ (Hero Vijay) తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) కీలక పాత్ర పోషిస్తూ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ తరుణంలో, ప్రియాంక తన తొలి సినిమా హీరో గురించి గతంలో పంచుకున్న జ్ఞాపకాలు సామాజిక మాధ్యమాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
సినీ రంగంలోకి అడుగుపెట్టిన కొత్తలో ప్రియాంకకు భాషాపరంగా ఎదురైన సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో ఆమెకు తమిళం అస్సలు రాకపోవడంతో, డైలాగులను కాగితంపై రాసుకుని మరీ బట్టీ పట్టేవారట. షూటింగ్ ప్రక్రియపై కూడా ఆమెకు అప్పట్లో కనీస అవగాహన ఉండేది కాదు. కేవలం థియేటర్‌లో సినిమాలు చూడటం తప్ప, కెమెరా ముందు నటించడం, సెట్స్‌లో వాతావరణం ఎలా ఉంటుందనే విషయాలు తనకు కొత్తని, ఆ గందరగోళంలో విజయ్ అందించిన సహకారం మరువలేనిదని ఆమె పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు.షూటింగ్ సమయంలో విజయ్‌కు ఉన్న అపారమైన ఫ్యాన్ బేస్ చూసి ప్రియాంక అప్పట్లోనే ఆశ్చర్యపోయారు. షూటింగ్ స్పాట్‌కు వందలాది మంది అభిమానులు పోటెత్తడం, ఆయనను చూడటానికి పోటీ పడటం ఆమెకు వింతగా అనిపించేదట. విజయ్ డ్యాన్స్ చేస్తున్నా లేదా డైలాగులు చెబుతున్నా అభిమానులు ఆరాధనతో చూడటం గమనించిన ప్రియాంక, ఆయన పట్ల ప్రజలకు ఉన్న క్రేజ్ చూసి షాక్‌కు గురయ్యారు. ఆ క్రేజ్ చూశాక విజయ్‌ను ప్రజలు కేవలం నటుడిగానే కాకుండా దైవసమానుడిగా భావిస్తారని తనకు అర్థమైందని ఆమె పేర్కొన్నారు.
యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘తమిజన్’ (Thamizhan) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, ప్రియాంక చోప్రాకు చిత్ర పరిశ్రమలో ఒక బలమైన పునాదిని వేసింది. ఈ చిత్ర దర్శకుడు మజీత్‌కు కూడా ఇది మొదటి సినిమా కావడం విశేషం. ఒక సామాన్య నటిగా ప్రయాణం మొదలుపెట్టి, నేడు హాలీవుడ్ వరకు ఎదిగిన ప్రియాంక విజయ ప్రస్థానానికి మూలబిందువు హీరో విజయ్ సినిమా కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ బ్యూటీ రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో వస్తున్న ‘వారణాసి’ (Varanasi) చిత్రంతో బిజీగా ఉంది. 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అటు విజయ్ దళపతి నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ సెన్సార్ నిబంధనల కారణంగా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను మరో రెండు వారాల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
అవసరమే కానీ.. పెళ్లిపై ఫరియా అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్!
‘అండర్ రేటెడ్’ నటిగా చూస్తున్నారా? పాయల్ రాజ్‌ఫుత్ సమాధానమిదే!
Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!
త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి