Priyanka Chopra: SSMB 29 కన్నా ముందు ప్రియాంక చేసిన తెలుగు సినిమా ఏంటో తెలుసా
ABN , Publish Date - Nov 14 , 2025 | 08:42 PM
దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడు. కొన్ని రోజుల వరకు తెలుగు ప్రేక్షకులకు కొద్దిమందికే తెల్సిన ప్రియాంక.. ఎప్పుడైతే SSMB29 లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందో అప్పటి నుంచి తెలుగు వారందరికీ సుపరిచితంగా మారింది.
Priyanka Chopra: దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడు. కొన్ని రోజుల వరకు తెలుగు ప్రేక్షకులకు కొద్దిమందికే తెల్సిన ప్రియాంక.. ఎప్పుడైతే SSMB29 లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందో అప్పటి నుంచి తెలుగు వారందరికీ సుపరిచితంగా మారింది. ఇప్పటివరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఏదో ఒక తెలుగు సినిమాలో నటించినవారే. కత్రీనా కైఫ్, దీపికా పదుకొనే, దిశా పటానీ, రవీనా టాండన్.. ఇలా అందరూ ఏదో ఒక సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వారే.
ప్రియాంక చోప్రా మాత్రమే తెలుగులో ఇప్పటివరకు ఎంట్రీ ఇవ్వలేదు. SSMB29 తోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.. అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ప్రియాంక కూడా తెలుగులో ఒక సినిమా చేసింది. 23 ఏళ్ళ క్రితమే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఏంటి నిజమా.. ఏ సినిమా.. ఎక్కడ చూడొచ్చు అని కంగారుపడకండి. ప్రియాంక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. మరి ఆ సినిమా వివరాలేంటో తెలుసుకుందాం.
మిస్ వరల్డ్ గా కిరీటాన్ని అందుకున్న ప్రియాంక.. వెంటనే హీరోయిన్ గా మారింది. తమిళన్ అనే కోలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఆ సినిమా సమయంలోనే ఆమెకు తెలుగులో అవకాశం వచ్చింది. మధుకర్, ప్రసన్న హీరోలుగా జిఎస్ రవికుమార్ దర్శకత్వంలో అపురూపం అనే సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా నుంచి పోస్టర్స్, ఆడియో సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. కానీ, ఆర్థిక సమస్యల వలన అపురూపం రిలీజ్ కు నోచుకోలేదు. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్ళిపోయిన ప్రియాంక అంచలంచెలుగా ఎదిగి గ్లోబల్ బ్యూటీగా మారింది. మధ్యలో రామ్ చరణ్ తో తుఫాన్ సినిమాలో నటించింది. అది తెలుగులో డబ్ మాత్రమే అయ్యింది. దీంతో అఫిషియల్ గా SSMB 29 నే ప్రియాంక మొదటి తెలుగు సినిమా అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.