Priyanka Chopra: 22ఏళ్లలో ఇదే మొదటిసారి!

ABN , First Publish Date - 2023-03-11T15:42:49+05:30 IST

బాలీవుడ్‌లో కెరీర్ ఆరంభించి హాలీవుడ్‌ వరకు ఎదిగిన అందాల భామ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). ఆమె తాజాగా నటించిన వెబ్‌సిరీస్ ‘సిటడెల్’ (Citadel). రిచర్డ్ మాడెన్ (Richard Madden) కీలక పాత్రను పోషించారు..

Priyanka Chopra: 22ఏళ్లలో ఇదే మొదటిసారి!

బాలీవుడ్‌లో కెరీర్ ఆరంభించి హాలీవుడ్‌ వరకు ఎదిగిన అందాల భామ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). ఆమె తాజాగా నటించిన వెబ్‌సిరీస్ ‘సిటడెల్’ (Citadel). రిచర్డ్ మాడెన్ (Richard Madden) కీలక పాత్రను పోషించారు. అయితే, సినీ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా కొనసాగుతున్నప్పటికి తనకు ఎప్పుడు హీరోతో సమానంగా రెమ్యునరేషన్ లభించలేదని ఆమె చెప్పారు.

‘సిటడెల్’ వెబ్‌సరీస్‌కు మాత్రమే తనకు హీరోతో సమానంగా పారితోషికం లభించిందని ప్రియాంక చోప్రా తెలిపారు. ఈ విధంగా రెమ్యునరేషన్ లభించడం అనేది 22ఏళ్లలో ఇదే మొదటిసారని ఆమె పేర్కొన్నారు. ప్రియాంక తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ విషయాలు చెప్పారు. ‘‘చిత్ర పరిశ్రమలో 22ఏళ్లుగా పనిచేస్తున్నాను. సినిమాలు, షోలు కలుపుకొని 70పైగా చేశాను. హీరోతో సమానంగా చాలా ప్రాజెక్టులకు పనిచేశాను. అయినప్పటికీ నాకు తక్కువగా రెమ్యునరేషన్ చెల్లించేవారు. ‘సిటడెల్’ కు మాత్రమే హీరోతో సమానంగా నాకు పారితోషికం లభించింది. ఇటువంటి విషయాలను చెబితే ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది’’ అని ప్రియాంక చోప్రా చెప్పారు.

‘సిటడెల్’ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ‘అవెంజర్స్’ ఫేమ్ రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించారు. అమెజాన్ స్టూడియోస్ నిర్మించింది. ఈ సిరీస్ ఏప్రిల్ 28నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ షోకు ఇండియన్ వెర్షన్ కూడా రూపొందుతుంది. ఇండియన్ వెర్షన్‌లో వరుణ్ ధావన్, సమంత రుత్ ప్రభు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-11T16:28:42+05:30 IST