Priyanka Chopra: అలా ఉంటే బోర్ కొడుతుంది.. షారుఖ్‌ ఖాన్‌కి గ్లోబల్ బ్యూటీ కౌంటర్..

ABN , First Publish Date - 2023-03-15T13:54:38+05:30 IST

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. అనంతరం హాలీవుడ్‌లో అడుగుపెట్టిన నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra).

Priyanka Chopra: అలా ఉంటే బోర్ కొడుతుంది.. షారుఖ్‌ ఖాన్‌కి గ్లోబల్ బ్యూటీ కౌంటర్..
Priyanka chopra

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. అనంతరం హాలీవుడ్‌లో అడుగుపెట్టిన నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra). అక్కడ సైతం వరుస చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సాధించుకుంది. అయితే.. ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనే, ఇమ్రాన్ ఖాన్ వంటి పలువురు బాలీవుడ్ నటుడు హాలీవుడ్‌లో స్థిరపడాలని ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ, ప్రియాంక మాత్రం విజయవంతమైంది.

అయితే.. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌ (Shah Rukh Khan)ని హాలీవుడ్ చిత్రాల్లో (Hollywood movies) నటింపజేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీని గురించి షారుఖ్ మాట్లాడుతూ.. ‘నేను అక్కడి(హాలీవుడ్)కి ఎందుకు వెళ్లాలి. ఇక్కడ చాలా సౌకర్యంగా ఉన్నప్పుడు..’ అని చెప్పుకొచ్చాడు.

Priyanka1.jpg

ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రియాంకచోప్రాని యాంకర్ అడిగారు. దానికి.. ‘సౌకర్యంగా ఉంటే నాకు బోర్ అనిపిస్తుంది. నాకు అహంకారం లేదు. కానీ ఆత్మవిశ్వాసం ఎక్కువ. నేను సెట్‌లోకి వెళ్లినప్పుడు నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు. ఇతరుల సలహాలు నాకు అవసరం లేదు. నేను ఆడిషన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. అలాగే పని చేయడానికీ సిద్ధంగా ఉంటాను. నేను మరొక దేశానికి వెళ్లినప్పుడు ఇంతకుముందు ఉన్న దేశంలోని నా విజయాలకి సంబంధించిన బరువుని మోసుకుంటూ వెళ్లను’ అని చెప్పుకొచ్చింది.

కాగా.. ప్రియాంక ప్రస్తుతం మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ దర్శకులు రుస్సో బ్రదర్స్ నిర్మాణంలో ‘సిటడెల్’ (Citadel)లో నటిస్తోంది. ఈ వెబ్‌సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime)లో ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలోనే ప్రియాంక షారుఖ్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Updated Date - 2023-03-15T13:54:38+05:30 IST