సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rashmika: 400 పేద కుటుంబాలకు అండగా.. రశ్మిక సంచలన నిర్ణయం

ABN, Publish Date - Oct 15 , 2026 | 08:39 AM

టాలీవుడ్ నుంచి మొదలై ‘నేషనల్ క్రష్’గా ఎదిగి.. నేడు పాన్-ఇండియా రేంజ్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న అగ్ర కథానాయిక రశ్మిక మందన్న.. ఇప్పుడో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Rashmika Mandanna

టాలీవుడ్ నుంచి మొదలై ‘నేషనల్ క్రష్’గా ఎదిగి.. నేడు పాన్-ఇండియా రేంజ్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న అగ్ర కథానాయిక రశ్మిక మందన్న (Rashmika Mandanna). వరుస బ్లాక్‌బస్టర్లతో ఇండస్ట్రీని శాసిస్తున్న ఆమె, ప్రస్తుతం ‘రణబాలి’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో మరోసారి వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రొఫెషనల్ లైఫ్‌లోనే కాకుండా సమాజ హితం కోసం ముందడుగు వేయడంలోనూ తాను ముందుంటానని నిరూపించుకున్నారు. తన భర్త విజయ్ దేవరకొండ ప్రారంభం నుంచే విద్యార్థుల చదువులకు, యువత ఎదుగుదలకు తోడ్పడుతూ మంచి మనసును చాటుకుంటుండగా.. ఇప్పుడు రశ్మిక సైతం అదే సేవా మార్గంలో అడుగులు వేస్తూ ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ (Project Annapurna) పేరిట అత్యంత ప్రతిష్టాత్మక సేవా కార్యక్రమానికి అధికారికంగా శ్రీకారం చుట్టారు.

‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’.. 400 కుటుంబాల దత్తత!

సమాజానికి తన వంతుగా శాశ్వత భరోసానివ్వాలనే సంకల్పంతో రశ్మిక ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, మహబూబ్‌నగర్, అనంతపురం, విజయవాడ, బెంగళూరు, కొచ్చిన్, చెన్నై, అలాగే ఆమె స్వస్థలమైన కొడగు ప్రాంతాల నుంచి అత్యంత నిరుపేదరికంలో ఉన్న 400 కుటుంబాలను ఆమె ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.


తొలి విడతగా 3 నెలల నిత్యావసరాలు పంపిణీ:

ఏదో నామమాత్రంగా ఒక పూట భోజనం పెట్టి చేతులు దులుపుకోవడం కాకుండా, వారి కడుపు నిండా భోజనం అందేలా ఒక పక్కా ప్రణాళికను రూపొందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. మొదటి విడతలోనే ఆయా 400 కుటుంబాలకు రాబోయే 3 నెలలకు సరిపడా గ్రోసరీలను (నిత్యావసర సరుకులు) అందజేశారు. వీటిలో నాణ్యమైన బియ్యం, గోధుమపిండి, రాగులు, వంటనూనె, మూడు రకాల పప్పులు, సోయా చంక్స్‌తో పాటు నిత్యం అవసరమయ్యే వంట సామగ్రిని పంపిణీ చేశారు. కేవలం ఆహార సరుకులతోనే కాకుండా.. కుటుంబాల ఖర్చులకు భరోసానిస్తూ, పిల్లల అవసరాలు, ఆర్థిక తోడ్పాటుతో పాటు రాబోయే ఏడాది మొత్తం ఆ కుటుంబాలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఆ చిరునవ్వులే నాకు దక్కిన అసలైన ప్రతిఫలం

ఈ సేవా కార్యక్రమం సందర్భంగా రశ్మిక మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఒక చిన్న దయ, ఒక చిన్న మంచి మనసు ఒక మనిషి జీవితాన్నే మార్చగలదు. మనం చేసే సాయం చాలా పెద్దదిగా ఉండాల్సిన పనిలేదు, చిన్న విషయంతోనే మొదలవుతుంది. గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో నేను గడిపిన నిద్రలేని రాత్రులు, తగిలిన గాయాలు, పడిన కష్టాలు, అనుభవించిన బాధ, కార్చిన కన్నీళ్లు.. వీటన్నిటికీ ఆ పేద కుటుంబాల ముఖాల్లో కనిపించే చిరునవ్వులే నాకు దక్కిన అసలైన ప్రతిఫలం. వాళ్ల ముఖాల్లోని నవ్వులు వెలకట్టలేనివి’’ అంటూ తన మనసులోని ఆనందాన్ని పంచుకున్నారు.


అంతేకాకుండా, త్వరలో విడుదల కానున్న ‘రణబాలి’ సినిమాలో తాను పోషించిన ‘జయమ్మ’ పాత్ర స్వభావానికి, తన నిజ జీవిత వ్యక్తిత్వానికి చాలా దగ్గరి పోలికలున్నాయని.. ఆ పాత్రలోని దయాగుణం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మనస్తత్వం తనలోనూ ఉందని పేర్కొన్నారు. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ అన్నపూర్ణగా మారి 400 కుటుంబాలకు ఆలంబనగా నిలిచిన రశ్మిక దేవరకొండ మంచి మనసుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆమె చేపట్టిన ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Kalki 2: నాగ్ అశ్విన్ ప్లాన్స్ వింటుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

బాబు కోరుకున్నట్లే బైక్ కొనిస్తా: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

క్లాస్‌రూమ్‌లో బిగ్ బాస్ ఓటింగ్ ప్రచారం.. కేతిరెడ్డి ఫిర్యాదుతో NCPCR కీలక ఆదేశాలు

Updated Date - Oct 15 , 2026 | 09:46 AM