బాబు కోరుకున్నట్లే బైక్ కొనిస్తా: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

ABN , Publish Date - Oct 14 , 2026 | 10:01 PM

హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన తాజా సిరీస్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బాబు డెగాల దర్శకత్వంలో చావన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు.

least eligible bachelor sm

హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన తాజా సిరీస్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Least Eligible Bachelor). బాబు డెగాల దర్శకత్వంలో చావన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు. రాజ్ సుహాస్, ప్రమదేశ్వి వి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. అక్టోబర్ 9 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ (ETV Win)లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో దర్శకుడు బాబుకు హర్ష చెముడు బైక్ కొనిస్తానని మాటిచ్చారు.


ఈ సందర్భంగా హర్ష చెముడు (Harsha Chemudu) మాట్లాడుతూ.. ‘‘వంశీ (వంశీ నందిపాటి) ఉన్నారంటే ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ అయినట్లే. సాయికృష్ణ ఈ ప్రాజెక్ట్‌కు చాలా సపోర్ట్ చేశారు. మా ప్రొడ్యూసర్ సపోర్ట్ కూడా చాలా ఉంది. ముఖ్యంగా చవన్ ఈ ప్రాజెక్ట్‌ను ఒక డైరెక్టర్‌లాగా, ఒక ఆడియన్‌లాగా, ఒక ప్రొడ్యూసర్‌లాగా అన్ని కోణాల్లో చూశారు. ఈ ప్రాజెక్ట్‌కు ఏమేం కావాలో అవన్నీ అందించారు. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా వచ్చింది. ఆదికి థ్యాంక్యూ. తను చాలా ఇన్‌పుట్స్ ఇచ్చాడు. అలాగే జీవన్ అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇదంతా ఒక మంచి టీమ్‌వర్క్ వల్లే జరిగింది.


ఇక దర్శకుడు బాబు విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. తను ఈ సిరీస్‌తో తనకంటూ ఒక పేరు క్రియేట్ చేసుకున్నాడు. ఇది చాలా హ్యాపీ జర్నీ. చాలామంది జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూశారు. బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కోరుకున్నట్లే తనకి ఒక బైక్ కొనిస్తాను. దీనికి సీజన్ 2 కూడా ఉంటుంది. టీమ్ మెంబర్స్ అందరూ ఈ ప్రాజెక్ట్‌ను ఓన్ చేసుకుని నటించారు. రీల్స్‌లో మా కంటెంట్ వైరల్ అవుతోంది. ఈ సిరీస్ చూసి చాలా మంది నాకు కాల్ చేశారు. చాలా మంది ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. నాలో వారిని చూసుకున్నానని చెప్పారు. ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, ఆలోచింపజేస్తుంది. అలాగే వాల్యూస్ గురించి, ఇన్‌సెక్యూరిటీస్ గురించి చాలా బ్యూటిఫుల్‌గా చెప్పారు. ఇంత మంచిగా ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు..’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

క్లాస్‌రూమ్‌లో బిగ్ బాస్ ఓటింగ్ ప్రచారం.. కేతిరెడ్డి ఫిర్యాదుతో NCPCR కీలక ఆదేశాలు

ఒకే వేదికపై రణ్‌బీర్ - రాకింగ్ స్టార్ యశ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

చార్ట్‌బస్టర్‌గా.. ‘రాయవలస’లోని ‘రింగుడు రింగుడు పిల్ల’

Updated Date - Oct 14 , 2026 | 10:01 PM

RC17: కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమాలు పూర్తి

స్ట్రీట్‌ ఫైటర్ ప్రీమియర్‌... విమర్శకుల ప్రశంసలు

‘మా ఆవిడ రుక్మిణి.. చాలా స్ట్రిక్ట్!’.. నితిన్ సినిమా నుంచి హీరోయిన్ పరిచయం

జైలర్ 2 ఆన్‌లైన్ విడుదలపై హైకోర్టు నిషేధం.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.40 కోట్లు!

నాని మళ్లీ లవ్ స్టోరీ బాటలోకి.. 96 డైరెక్టర్‌తో సినిమా?