Rashmika : అందాల రాశికి అందలం

ABN , Publish Date - Feb 16 , 2024 | 05:48 AM

అందం, అభినయం కలగలిసిన ముద్దుగుమ్మగా ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్నారు టాలీవుడ్‌ కథానాయిక రష్మిక మందన్న. ఇప్పుడు ఆమె మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు...

Rashmika : అందాల రాశికి అందలం

అందం, అభినయం కలగలిసిన ముద్దుగుమ్మగా ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్నారు టాలీవుడ్‌ కథానాయిక రష్మిక మందన్న. ఇప్పుడు ఆమె మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30 జాబితాలో రష్మిక చోటు దక్కించుకున్నారు. 30 ఏళ్లలోపు వయసు ఉన్న 30 మంది ప్రతిభావంతుల జాబితాలో రష్మిక అగ్రస్థానం దక్కించుకున్నారు. సోషల్‌ మీడియా ద్వారా రష్మిక ఈ విషయాన్ని అభిమానులతో పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప 2’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ‘రెయిన్‌ బో’ ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ అనే హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి.

Updated Date - Feb 16 , 2024 | 05:48 AM