Rashmika Mandanna : అడవిలో అందాల భామ

ABN , Publish Date - Jul 06 , 2024 | 05:32 AM

తమిళ హీరో ధనుష్‌, టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున కలయికలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్‌ ‘కుబేర’. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

తమిళ హీరో ధనుష్‌, టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున కలయికలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్‌ ‘కుబేర’. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. రష్మిక మందన్న కథానాయిక. శుక్రవారం చిత్రబృందం రష్మిక ఫస్ట్‌ లుక్‌, క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో రాత్రిపూట డబ్బుతో ఉన్న ట్రాలీ బ్యాగ్‌తో అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న రష్మిక లుక్‌ ఆసక్తికరంగా ఉంది. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Jul 06 , 2024 | 05:32 AM