Kalki 2: నాగ్ అశ్విన్ ప్లాన్స్ వింటుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
ABN , Publish Date - Oct 14 , 2026 | 10:15 PM
డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ‘కల్కి 2898 AD’ వరల్డ్ వైడ్‌గా ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలియంది కాదు. ఇప్పుడీ చిత్ర సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వేచిచూస్తున్నారు.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) లైనప్‌లో ఉన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో ‘కల్కి 2’ (Kalki 2) ముందు వరుసలో ఉంటుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ‘కల్కి 2898 AD’ వరల్డ్ వైడ్‌గా ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలియంది కాదు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇప్పుడు అందరి దృష్టీ ఈ సినిమా సీక్వెల్‌పైనే పడింది. పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ సీక్వెల్ కోసం నాగ్ అశ్విన్ చేస్తున్న ప్లాన్స్ వింటుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
సాధారణంగా హాలీవుడ్ ఇండస్ట్రీలో మార్వెల్, డీసీ లాంటి బిగ్గెస్ట్ స్టూడియోలు సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా రికార్డులు కొల్లగొట్టాయి. సరిగ్గా అదే స్ట్రాటజీని మన ఇండియన్ మైథాలజీతో మిక్స్ చేసి, ఒక భారీ ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’ని నాగ్ అశ్విన్ సిద్ధం చేస్తున్నారు. పార్ట్ 1 కేవలం ఒక చిన్న శాంపిల్ మాత్రమేనని, అసలైన కథ, అసలైన ప్రపంచం ముందు ముందు విస్తరించబోతోందని తాజా బజ్ స్పష్టం చేస్తోంది. తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సరికొత్త సమాచారం ప్రకారం.. నాగ్ అశ్విన్ కేవలం సినిమాలతోనే ఆగడం లేదు. కల్కి యూనివర్స్‌లోని కీలక పాత్రలను మరింత లోతుగా పరిచయం చేసేందుకు ప్రత్యేకంగా వెబ్ సిరీస్‌లను కూడా ప్లాన్ చేస్తున్నారట. పార్ట్ 1 లో కెప్టెన్ పాత్రలో కనిపించి మెప్పించిన దుల్కర్ సల్మాన్ రోల్ వెనుక పెద్ద బ్యాక్‌స్టోరీ ఉంది. ఆ పాత్ర ఆధారంగా ఒక సెపరేట్ సిరీస్ వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.
దీంతో పాటు, ఈ యూనివర్స్‌లోకి మరో టాలెంటెడ్ నటి సాయి పల్లవి ఎంట్రీ ఇవ్వబోతోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆమె పాత్రపై కూడా ఒక స్టాండలోన్ సిరీస్ లేదా ప్రత్యేక ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారట. అంటే మెయిన్ స్టోరీ ప్రభాస్ లీడ్ రోల్లో బిగ్ స్క్రీన్‌పై నడుస్తుండగానే, మిగతా పాత్రల ప్రయాణాన్ని ఓటీటీ వేదికగా సిరీస్ రూపంలో ఆడియన్స్‌కు అందించే భారీ వ్యూహం కనిపిస్తోంది. నిజానికి నాగ్ అశ్విన్ ప్లానింగ్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. పార్ట్ 1 రిలీజ్ కావడానికి ముందే ‘బుజ్జి అండ్ భైరవ’ పేరుతో రెండు ఎపిసోడ్ల యానిమేషన్ సిరీస్‌ను తీసుకొచ్చారు. అది సినిమా ప్రమోషన్లకు ఎంతలా ప్లస్ అయ్యిందో ప్రత్యక్షంగా చూశాం. ఇప్పుడు అదే ఫార్ములాను లైవ్-యాక్షన్ సిరీస్‌ల రూపంలో ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం మన దగ్గర ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాటిక్ యూనివర్స్ ఆవిష్కృతం కావడం ఖాయం.
ఒకవైపు ప్రభాస్ భైరవ పాత్ర రూపాంతరం, మరోవైపు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్, ఇంకోవైపు సుప్రీమ్ యాస్కిన్‌గా కమల్ హాసన్ విధ్వంసం.. వీటన్నింటి మధ్య దుల్కర్, సాయి పల్లవి లాంటి స్టార్స్ చుట్టూ తిరిగే సమాంతర కథనాలు కూడా తోడైతే, ఈ ప్రాజెక్ట్ రీచ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ మైండ్‌లో ఉన్న విజన్ చూస్తుంటే, ఆయన ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎవరూ టచ్ చేయని సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరి కల్కి సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే ఈ స్పిన్-ఆఫ్ సిరీస్‌లు ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాయో చూడాలి.
ఇవి కూడా చదవండి:
బాబు కోరుకున్నట్లే బైక్ కొనిస్తా: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
క్లాస్‌రూమ్‌లో బిగ్ బాస్ ఓటింగ్ ప్రచారం.. కేతిరెడ్డి ఫిర్యాదుతో NCPCR కీలక ఆదేశాలు
ఒకే వేదికపై రణ్‌బీర్ - రాకింగ్ స్టార్ యశ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!