Rashmika Mandanna : అసిస్టెంట్ పెళ్లిలో లుక్ అదిరింది.. ఆశ్చర్యపరచింది..
ABN , First Publish Date - 2023-09-04T13:21:39+05:30 IST
‘పుష్ప’ (Pushpa) సినిమాతో నేషనల్ క్రష్‌గా (National Crush Rashmika) గుర్తింపు దక్కించుకుంది బెంగుళూరు బ్యూటీ రష్మిక. ప్రస్తుతం ‘పుష్ప-2’ (Pushpa 2)తో పాటు హిందీలో కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉంది.

‘పుష్ప’ (Pushpa) సినిమాతో నేషనల్ క్రష్‌గా (National Crush Rashmika) గుర్తింపు దక్కించుకుంది బెంగుళూరు బ్యూటీ రష్మిక. ప్రస్తుతం ‘పుష్ప-2’ (Pushpa 2)తో పాటు హిందీలో కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’ (Animal) చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది. మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘రెయిన్‌బో’ లోనూ కనిపించనుంది. తాజాగా ఆమె వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తన అసిస్టెంట్ సాయి పెళ్లికి హాజరై సందడి చేశారు. సంప్రదాయంగా లుక్‌లో వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. బిజీ షెడ్యూల్‌లోనూ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అయితే ఈ పెళ్లి వేదికపై ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రష్మిక ఆశీర్వాదం కోసం నూతన దంపతులలు ఆమె కాళ్లకు నమస్కరించారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బిజీ సమయంలోనూ రష్మిక తన అసిస్టెంట్ పెళ్లికి హాజరు కావడం పట్ల అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.