విజయవాడలో ఫరియా అబ్దుల్లా క్రేజ్.. తోపులాట

ABN , Publish Date - Sep 23 , 2026 | 09:02 AM

నటి ఫరియా అబ్దుల్లా విజయవాడలో జరిగిన ఓ మొబైల్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొని అభిమానులను అలరించారు.

Faria Abdullah

ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) మంగళవారం విజ‌య‌వాడ (Vijayawada) లో సందడి చేసింది. తమ అభిమాన నటిని కనులారా చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో కుర్రకారు తరలివచ్చారు. గవర్నరుపేట రామమందిరం సమీపంలో ఒక మొబైల్ దుకాణం ప్రారంభోత్సవానికి ఆమె వస్తున్న‌ట్లు తెలియ‌డంతో యువత, విద్యార్థులు ఉదయం నుంచే ఇక్కడకు తరలివచ్చారు. నటితో సెల్ఫీలు దిగేందుకు అందరూ పోటీ పడ్డారు. ఒకానొక దశలో తోపులాట జరగడంతో, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

జాతిరత్నాలు చిత్రంలో చిట్టి (Jathi Ratnalu Chitti) పాత్రలో ఫరియా అద్భుతంగా నటించడంతో, కొందరు కుర్రకారు ఆమెను చిట్టి.. చిట్టి అని బిగ్గరగా అరుస్తూ అక్కడున్న వారందరినీ కడుపుబ్బా నవ్వించారు. వారితో పాటు ఫరియా కూడా కాసేపు నవ్వులు కురిపించడం ద్వారా యువతను మరింత హుషారు పెట్టింది. మొత్తం మీద ఫారియా రాకతో బెజవాడ నగర యువత ఫిదా అయిందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Updated Date - Sep 23 , 2026 | 09:02 AM