సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దూకుడు పెంచిన దీపిక.. రూమర్స్‌కు చెక్!

ABN, Publish Date - Apr 25 , 2026 | 12:55 PM

బాలీవుడ్‌ స్టార్‌ నటి దీపికా పదుకొణె షూటింగ్స్‌లలో దూకుడు పెంచారు. వరుస షెడ్యూల్స్‌తో బిజీ అయ్యారు. దీంతో ఆమెపై వస్తున్న రకరకాల ఊహాగానాలకు చెక్ పెట్టారు.

Deepika Padukone

బాలీవుడ్‌ స్టార్‌ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) షూటింగ్స్‌లలో దూకుడు పెంచారు. వరుస షెడ్యూల్స్‌తో బిజీ అయ్యారు. తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు ఇటీవలే దీపిక ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి సోషల్‌ మీడియాలో ఆమె నటిస్తోన్న సినిమాలపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. కొందరు ఆమె పాత్ర నిడివి తగ్గించారని అంటే.. ఆమె ప్రెగ్నెన్సీ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోతాయని మరికొందరు.. ఇలా ఎవరికి తోచినట్లు వారు కామెంట్స్ చేయసాగారు. అయితే వీటన్నింటికీ చెక్‌ పెడుతూ దీపిక నటిస్తోన్న చిత్రాలకు సంబంధించి వరుసగా అప్డేట్స్‌ వస్తున్నాయి.


దీపిక పాత్ర నిడివిని తగ్గించలేదని, అనుకున్న షెడ్యూల్స్‌ ప్రకారమే షూటింగ్‌ కొనసాగతుందని ఇటీవలె ‘రాకా’ (Raaka) టీమ్‌ స్పష్టతనివ్వగా, తాజాగా షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan)తో ఆమె నటిస్తోన్న యాక్షన్‌ చిత్రం ‘కింగ్‌’ (King) నుంచి కూడా అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ‘జవాన్‌’ తర్వాత షారుఖ్‌ ఖాన్‌తో చేస్తున్న ‘కింగ్’ సినిమాకు సంబంధించి.. ఈనెల 21, 22 తేదీల్లో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రబృందం చిత్రీకరించింది. ముంబాయిలోని గోల్డెన్‌ టుబాకో స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో షారుఖ్‌ ఖాన్‌తో కలసి దీపిక చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో మొత్తం ఎనిమిది పోరాట సన్నివేశాలను చిత్రీకరించారని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది.


అదే విధంగా మీరా రోడ్‌ స్టూడియోలో ఇసుక నేపథ్యంలో మరో భారీ సెట్‌ వేస్తున్నారని, ఇందులో దీపికపై మరికొన్ని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణకు దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ప్లాన్‌ చేశారని సమాచారం. కాగా, ఈ సినిమాను క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ప్రెగ్నెన్సీతో ఉండి కూడా ఇలా యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణలో పాల్గొంటోన్న దీపికాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇవి కూడా చదవండి:

Varanasi: మహేష్ కోసమే ఆ కష్టాలు.. జక్కన్న పక్కా ప్లానింగ్!

స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!

అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!

Updated Date - Apr 25 , 2026 | 12:55 PM