Deepika Padukone: అంతర్జాతీయ వేదికపై మరోసారి వ్యాఖ్యాతగా..!

ABN , Publish Date - Feb 14 , 2024 | 10:41 AM

ప్రపంచ సినిమా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ వేదికపై గతేడాది వ్యాఖ్యాతగా సందడి చేశారు బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika padukone). 95వ ఆస్కార్‌ వేదికపై 'నాటు నాటు' పాటను పరిచయం చేసిన ఆమె ఈ ఏడాది కూడా అలాంటి ఓ వేదిక పై వ్యాఖ్యాతగా అలరించనున్నారు.

Deepika Padukone: అంతర్జాతీయ వేదికపై మరోసారి వ్యాఖ్యాతగా..!

ప్రపంచ సినిమా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ వేదికపై గతేడాది వ్యాఖ్యాతగా సందడి చేశారు బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika padukone). 95వ ఆస్కార్‌ వేదికపై 'నాటు నాటు' పాటను పరిచయం చేసిన ఆమె ఈ ఏడాది కూడా అలాంటి ఓ వేదిక పై   వ్యాఖ్యాతగా  అలరించనున్నారు.

సినీ ప్రపంచంలో అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటిగా భావించే బాఫ్టా (బ్రిటిష్‌ అకాడెమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌) (BAFTA) అవార్డులకు ఈసారి ఆమె ప్రఖ్యాత సాకర్‌ ఆటగాడు డేవిడ్‌ బెక్‌హామ్‌, హాలీవుడ్‌ నటి కేట్‌ బ్లంచెట్‌లతో కలిసి సహ వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. బ్రిటిష్‌ సినిమాలతోపాటు అంతర్జాతీయ చిత్రాలకు ఈ అవార్డులు అందజేస్తారు. ఈ నెల 18న, భారత కాలమానం ప్రకారం 19న ఈ వేడుకలు జరగనున్నాయి.

1234.jpg

Updated Date - Feb 14 , 2024 | 10:41 AM