Varanasi: మహేష్ కోసమే ఆ కష్టాలు.. జక్కన్న పక్కా ప్లానింగ్!

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:20 PM

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న గ్లోబ్‌ట్రోటర్‌ యాక్షన్‌ అడ్వంచర్‌ ‘వారణాసి’. ఈ సినిమా విషయంలో రాజమౌళి ప్లానింగ్‌కు సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.

SS Rajamouli Planning on Varanasi

సూపర్‌స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న గ్లోబ్‌ట్రోటర్‌ యాక్షన్‌ అడ్వంచర్‌ ‘వారణాసి’ (Varanasi). ‘బాహుబలి, త్రిబుల్‌ ఆర్‌’ సినిమాలతో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన జక్కన్న తీస్తున్న సినిమా కావడంతో, ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాదాపు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘వారణాసి’ మూవీ ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఈ సినిమా గురించి వచ్చే చిన్న వార్త అయినా సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇటీవల మెక్సికో సిటీలో జరిగిన ప్రతిష్టాత్మక CCXP MX 2026 పాప్ కల్చర్ ఫెస్టివల్‌లో ‘వారణాసి’ టీమ్ సందడి చేసింది. నిర్మాతలలో ఒకరైన ఎస్.ఎస్. కార్తికేయ ఈ ఈవెంట్‌కు హాజరై, అక్కడ వారణాసికి సంబంధించిన ఒక స్పెషల్ ‘ప్రీ గ్లింప్స్’ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి పంపిన వీడియో మెసేజ్ ఇప్పుడు గ్లోబల్ వైడ్‌గా వైరల్ అవుతోంది.


మాయన్ నాగరికత.. వారి కట్టడాలు.. ఎప్పుడూ నన్ను విస్మయానికి గురిచేస్తూనే ఉంటాయి. ‘బాహుబలి’ (Baahubali) సినిమాలో చూసిన మాహిష్మతి నగరం, అందులోని సిటీ సెంటర్ ఆ అద్భుతమైన సింహాసనం.. వీటన్నిటికీ మెక్సికోలోని ప్రసిద్ధ చిచెన్ ఇట్జా పిరమిడ్లే ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాయని, రాజమౌళి తన గత చిత్రాల్లోనే ఈ మెక్సికన్ ఆర్కిటెక్చర్ నుంచి స్ఫూర్తి పొందానని ఈ వీడియోలో తొలిసారి బయటపెట్టారు. ఇక ఇండియన్ మైథాలజీని, గ్లోబల్ స్టాండర్డ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించిన వారణాసి ప్రీ గ్లింప్స్‌కు అక్కడి ఆడియెన్స్‌ ఫిదా అయ్యారు. ఈ సినిమా మేకింగ్ హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక మరోవైపు ‘వారణాసి’ కోసం మహేష్ బాబు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ ముగియడంతో షూటింగ్‌కు చిన్న గ్యాప్ దొరికింది. కానీ రాజమౌళి మాత్రం మహేష్ బాబుకు విశ్రాంతి ఇవ్వకుండా నేరుగా ఆయనను విదేశాలకు పంపించారు.


త్వరలోనే ‘వారణాసి’ తదుపరి షెడ్యూల్ అంటార్కిటికాలోని కఠినమైన మంచు గడ్డల మధ్య జరుగుతుండడంతో అక్కడి మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలకు మహేష్ బాబు శరీరం అలవాటు పడేలా, ప్రస్తుతం ఆయనకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారట. ఎక్కడా టైమ్ వేస్ట్ కాకూడదని జక్కన్న పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు. మంచు కొండల్లో చేసే సాహసోపేతమైన పోరాట సన్నివేశాల కోసం మహేష్ ఇప్పుడు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీపై కూడా వర్క్ చేస్తున్నారు. అడ్వెంచర్ అంటే ఇలా ఉండాలని రాజమౌళి చూపిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తున్నారు. విలక్షణ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఆగస్ట్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 ఏప్రిల్ 7న సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న వారణాసి భారతీయ సినిమా సత్తాను గ్లోబల్ మార్కెట్‌లో మరోసారి చాటడం ఖాయంగా కనిపిస్తోంది. జక్కన్న మార్క్ గ్రాఫిక్స్, కీరవాణి సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం గ్యారెంటీ.

ఇవి కూడా చదవండి:

స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!

అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!

Updated Date - Apr 25 , 2026 | 12:20 PM

Varanasi Event: మహేశ్‌ ఎంట్రీ ప్లాన్‌ ఎలా చేశారో చూడండి

Varanasi: 'వారణాసి'.. స‌రికొత్త చ‌రిత్ర! ఆ థియేటర్‌లో.. టీజర్ స్క్రీనింగ్

Varanasi: గ్లోబల్‌ వేదికపై ‘వారణాసి’ ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌..

Varanasi: జార్జియాలో జక్కన్న వేట! మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలే

Varanasi: జెట్ స్పీడ్‌లో.. వార‌ణాసి! 8 నెల‌ల్లో.. షూటింగ్‌ పూర్తి