Deepika Padukone: ఏం నేర్చుకున్నాం.. ఎవరితో చేస్తున్నామనే విషయాలే ప్రధానం.. 

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:50 AM

ప్రస్తుతం అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ హాట్‌ టాపిక్‌గా మారారు దీపిక పదుకోన్‌. ‘కల్కి-2’ చిత్రం నుంచి ఆమె వైదొలిగిన సంగతి తెలిసిందే.

Deepika Padukone

ప్రస్తుతం అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ హాట్‌ టాపిక్‌గా మారారు దీపిక పదుకోన్‌ (Deepika Padukone). ‘కల్కి-2’ (Kalki2) చిత్రం నుంచి ఆమె వైదొలిగిన సంగతి తెలిసిందే! ఆమె ఆ చిత్రం నుంచి తప్పుకోవడానికి గల కారణాలు కోసం నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా దీపిక ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుక్‌ఖాన్‌తో (Shah Rukh Khan) కలిసి ఆమె ఆరో సినిమా చేయడం గురించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షారుక్‌ తనకు నేర్పిన పాఠం గురించి ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఆమె పరోక్షంగా ‘కల్కి 2’ గురించే మాట్లాడారని సోషల్‌ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

‘18 ఏళ్ల క్రితం ‘ఓం శాంతి ఓం’ సినిమా చేస్తున్నప్పుడు నాకు షారుక్‌ కొన్ని పాఠాలే నేర్పారు. సినిమాతో మనం ఏం నేర్చుకున్నాం.. అందులో ఎవరితో చేస్తున్నామనే విషయాలే.. సినిమా విజయం కంటే ప్రధానమైన అంశాలని చెప్పారు. నేను ఆ మాటలను పూర్తిగా నమ్ముతాను. అప్పటి నుంచి నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆ పాఠాన్నే అమలు చేస్తున్నాను. ఆయనతో ఆరో సినిమా చేయడానికి కారణం అదేనేమో’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం దీపిక (Deepika Viral Post) పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇప్పుడు షారుక్‌, దీపికల కాంబినేషన్‌లో ‘కింగ్‌’ సినిమా తెరకెక్కుతోంది. సిద్థార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీపికి పోస్ట్‌కు రణవీర్‌సింగ్‌; సయామీ ఖేర్‌, గునీత్‌ మోంగాతోపాటు  పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు అభినందనలు  తెలిపారు.


‘కల్కి 2898 ఏడీ’కు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రంలో దీపిక నటించడం లేదంటూ నిర్మాణ సంస్థ ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఇది చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దర్శకుడు నాగ అశ్విన్‌ కడాఆ పరోక్షంగా కౌంటర్‌ వేశారు. ‘‘జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ, తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు’ అని ఇన్‌స్టాలో ఆయన పోస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంపై దీపిక ఎలా స్పందిస్తారోనని అందరూ ఎదురుచూశారు. అయితే ఆమె షారుక్‌తో కొత్త సినిమా అప్‌డేట్‌తో తన నిర్ణయాల గురించి చెప్పడం ఆసక్తి నెలకొంది. ఇది ఇన్‌డైరెక్ట్‌గా నాగ అశ్విన్‌కు కౌంటరేనని నెటిజన్లు అంటున్నారు. 

Updated Date - Sep 20 , 2025 | 12:00 PM