‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!
ABN , Publish Date - Apr 24 , 2026 | 08:14 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం అక్కినేని అఖిల్ మరోసారి త్యాగం చేయక తప్పదా? అంటే, అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) కోసం అక్కినేని అఖిల్ (Akhil Akkineni) మరోసారి త్యాగం చేయక తప్పదా? అంటే, అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. ఫైనల్‌గా జూన్‌లో రిలీజ్ అనేలా టాక్ మొదలైంది. మే 1న విడుదల కావాల్సిన అఖిల్ ‘లెనిన్’ (Lenin) చిత్రం, ఏప్రిల్ 30న ‘పెద్ది’ (Peddi) అని అనౌన్స్ చేయగానే, రామ్ చరణ్‌కు గౌరవమిస్తూ.. జూన్ 26న విడుదల అంటూ అధికారికంగా తెలియజేశారు. రామ్ చరణ్, అఖిల్ అక్కినేనిల మధ్య ఉన్న ఆత్మీయ బంధంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా నిర్మాతలు తెలిపారు. కానీ, ఏప్రిల్ 30న ‘పెద్ది’ రిలీజ్ కాలేదు. ఇంకా ఆరు రోజుల షూటింగ్ మిగిలి ఉందని దర్శకుడు బుచ్చిబాబు సానా రీసెంట్‌గానే ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ‘పెద్ది’ సినిమాను జూన్ 25న విడుదల చేయబోతున్నారని, అధికారిక ప్రకటన కూడా రాబోతుందనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు మొదలయ్యాయి.
‘పెద్ది’ మేకర్స్ ఇప్పటి వరకు రిలీజ్ పై క్లారిటీ ఇవ్వలేదు కానీ, జూన్ 25 మాత్రం పక్కాగా థియేటర్లలోకి వస్తుందనేలా టాక్ నడుస్తోంది. దీంతో మరోసారి అఖిల్ ‘లెనిన్’ వాయిదా తప్పదంటూ కూడా వార్తలు మొదలయ్యాయి. చరణ్, అఖిల్‌ల బంధంలో మార్పు ఉండదు కాబట్టి, అప్పుడు తీసుకున్న నిర్ణయమే, మళ్లీ తీసుకుంటారని, మరోసారి ‘లెనిన్’ వాయిదా పడటంలో సందేహమే లేదనేలా, నెటిజన్లు కామెంట్స్ స్టార్ట్ చేశారు. నిజంగా రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా కనుక జూన్ 25న వస్తే మాత్రం, ‘లెనిన్’ వాయిదా పడుతుంది.. అందులో డౌటే లేదు. ఎందుకంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అఖిల్ ఏ పెద్ద సినిమాతో పోటీ పడడానికి ఇష్టపడడు. సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నా సరే.. సోలో రిలీజ్‌కే ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి.. ‘లెనిన్’ మరోసారి వాయిదా తప్పదు.
అయితే ఇక్కడే ఓ డౌట్‌ను కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు మే 1న రిలీజ్ అని ప్రకటించారంటే, సినిమా దాదాపు పూర్తయ్యే ఉంటుంది. కానీ, ఏప్రిల్ 30న ‘పెద్ది’ అనగానే మే నెల మొత్తం వదిలేసి జూన్‌లో రిలీజ్ అని ‘లెనిన్’ టీమ్ ప్రకటించారు. అంత గ్యాప్ తీసుకున్నారంటే, కారణం ‘పెద్ది’ కాదని తెలుస్తోంది. ‘లెనిన్’ కూడా ఇంకా షూటింగ్ మిగిలి ఉంది కాబట్టే.. అంత గ్యాప్ తీసుకున్నారనే విషయం అర్థమవుతోంది. లేదంటే, ‘పెద్ది’ వాయిదా అని తెలియగానే వెంటనే ‘లెనిన్’ని లైన్‌లో పెట్టేయవచ్చు. కానీ, అది జరగలేదు. మరోవైపు ‘గాయపడ్డ సింహం’ సినిమా టీమ్ కూడా ‘పెద్ది’ కనుక ఏప్రిల్ 30న వస్తే వాయిదా వేసుకుంటామని చెప్పారు. ఎప్పుడైతే ‘పెద్ది’ ఆ డేట్‌కి రావడం లేదని తెలిసిందో.. చెప్పినట్లుగానే మే 1వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
తమన్నాతో బ్రేకప్.. మరో యంగ్ బ్యూటీని పట్టిన విజయ్ వర్మ!
పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌లోకి మరో బ్యూటీ! ఇక పరువాల విందే!
ఓటు ఎవరికి వేశాడో.. పబ్లిగ్గా చెప్పేసిన వీటీవీ గణేష్.. వీడియో వైరల్!