Deepika Padukone: అప్పుడు వద్దని.. ఇప్పుడు ఓకే అందట..
ABN , Publish Date - May 03 , 2025 | 11:09 AM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం 'స్పిరిట్' సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు డార్లింగ్ ఫ్యాన్ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కనున్న చిత్రం 'స్పిరిట్' (Spirit) సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు డార్లింగ్ ఫ్యాన్ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి కొత్త అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించబోతునట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ‘కల్కి’ చిత్రంలో ప్రభాస్, దీపికా జంటగా నటించారు. ఈ సినిమా కోసం మరోసారి జోడీ కట్టనున్నట్లు అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ టాక్ నడుస్తోంది. ఈ చిత్రం గతేడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రభాస్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల వాయిదా పడింది.
తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. గత సంవత్సరం సెప్టెంబరు 8న దీపికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో ‘స్పిరిట్’ షూటింగ్ ప్రారంభం అవుతుందనుకున్నారు. ఆ సినిమాలో నటించమని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేసిన ఆఫర్‌ను దీపిక తిరస్కరించారని టాక్ నడిచింది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో మళ్లీ ఆ సినిమాను చేయాలని ఈ బ్యూటీ నిర్ణయం తీసుకుందని కొత్తగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘స్పిరిట్’లో నటించడానికి ఆమె ఓకే చెప్పినట్లు ఫిల్మ్‌నగర్. 2027 ఫస్టాఫ్‌లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని నిర్మాత భూషణ్‌కుమార్ వెల్లడించారు.