Little Hearts: అనుకున్న రోజుకంటే ముందే...
ABN, Publish Date - Aug 23 , 2025 | 01:16 PM
ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ ఆలస్యంగా రిలీజ్ అవుతున్నాయి. కానీ చిత్రంగా 'లిటిల్ హార్ట్స్' మూవీ అనుకున్న దానికంటే వారం ముందే జనం ముందుకు వస్తోంది.
సహజంగా ఇవాళ చాలా సినిమాలు అనుకున్న తేదీకి విడుదల కావడం లేదు. మూడు, నాలుగు సార్లు వాయిదా పడిన తర్వాతే విడుదల అవుతున్నాయి. అయితే అందుకు భిన్నంగా 'లిటిల్ హార్ట్స్' (Little Hearts) మూవీ ముందు ప్రకటించిన దానికంటే ఓ వారం అడ్వాన్డ్స్ గా జనం ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. 'నైన్టీస్ మిడిల్ క్లాస్ బయోపిక్'లో నటించిన మౌళి తనుజ్ (Mouli Tanuj), 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'లో హీరోయిన్ గా నటించిన శివానీ నాగారం (Shivani Nagaram) 'లిటిల్ హార్ట్స్' మూవీలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ లో సాయి మార్తాండ్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. విశేషం ఏమంటే... దీనికి 'నైన్టీస్ మిడిల్ క్లాస్ బయోపిక్' దర్శకుడు ఆదిత్య హాసన్ (Aditya Hasan) నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
మౌళి తనూజ్, రాజీవ్ కనకాల తండ్రీ కొడుకులుగా నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ (Bunny Vas), వంశీ నందిపాటి (Vamsi Nandipati ) థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. వీరి దన్ను కారణంగానే 'లిటిల్ హార్ట్స్' వారం ముందే వస్తోందని అనుకోవాలి. అలానే సెప్టెంబర్ 5న రావాల్సిన తేజ సజ్జా 'మిరాయి' సినిమా సీజీ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. అలానే విజయ్ ఆంటోని 25వ సినిమా 'భద్రకాళి' కూడా సెప్టెంబర్ 19కి పోస్ట్ పోన్ అయ్యింది. సో... ఇప్పుడు సెప్టెంబర్ 5న అనుష్క (Anushka) నటించిన 'ఘాటి', శివ కార్తికేయన్ (Siva Karthikeyan) 'మదరాసి' సినిమాలు మాత్రమే చెప్పుకోదగ్గవి వస్తున్నాయి. మరి ఈ భారీ చిత్రాల నడుమ ''లిటిల్ హార్ట్స్' ప్రేక్షుకుల మనసుల్ని ఏ మేరకు దోచుకుంటుందో చూడాలి.
Also Read: Rasha Thadani: చరణ్, మోక్షజ్ఞతో కాదు.. జయకృష్ణతో రాషా తడానీ రొమాన్స్
Also Read: Beauty Teaser: ‘బ్యూటీ’ రిలీజ్ డేట్ టీజర్