Little Hearts Teaser: మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఇద్దరు పిల్లల్ని ఎందుకు కంటారో తెలుసా
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:47 PM
ఈమధ్యకాలంలో ఒరిజినల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆలరిస్తుంది ఈటీవీ విన్ (ETV Win). ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. ఇప్పటికే #90s, అనగనగా, కానిస్టేబుల్ కనకం లాంటి ఒరిజినల్స్ తో ఈటీవీ విన్ మంచి గుర్తింపును తెచ్చుకుంది.
Little Hearts Teaser: ఈమధ్యకాలంలో ఒరిజినల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆలరిస్తుంది ఈటీవీ విన్ (ETV Win). ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. ఇప్పటికే #90s, అనగనగా, కానిస్టేబుల్ కనకం లాంటి ఒరిజినల్స్ తో ఈటీవీ విన్ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇప్పుడు వీటి సరసన లిటిల్ హార్ట్స్(Little Hearts) చేరబోతోంది. #90s సిరీస్ లో పెద్ద కొడుకులా నటించి మెప్పించిన మౌళి.. ఇప్పుడు సోలో హీరోగా రాబోతున్నాడు.
మౌళి, శివాని నగారం జంటగా సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లిటిల్ హార్ట్స్. #90s సిరీస్ కు దర్శకత్వం వహించిన ఆదిత్య హాసన్ ఈసినిమాను నిర్మిస్తున్నాడు. రాజీవ్ కనకాల, SS కంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 12 న థియేటర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా లిటిల్ హార్ట్స్ టీజర్ ను మేకర్స్ ను రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది.
ఇది కూడా మిడిల్ క్లాస్ కుర్రాళ్ల జీవితాలకు సంబందించిన కథలానే అనిపిస్తుంది. అఖిల్ అనే కుర్రాడు.. తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి కాలేజ్ లో చేసిన అల్లరి.. తండ్రి దగ్గర తిన్న తిట్లు, మొదటి ప్రేమ, స్నేహం.. కెరీర్ ను ఎలా మలుచుకున్నాడు.. ఇలా ప్రతిదాన్ని ఎంతో కామెడీగా చూపించారు. మౌళి కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. #90s సిరీస్ లో మొదటి ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్ గా కనిపించిన మౌళి.. ఈ సినిమాలో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ గా కనిపించాడు.
ఇక మిడిల్ క్లాస్ ఫాదర్ గా రాజీవ్ కనకాల కనిపించగా.. తల్లిగా అనితా చౌదరి నటించింది. ఇక డైలాగ్స్ కూడా ఆకట్టుకొనేలా ఉన్నాయి. ముఖ్యంగా 'చివర్లో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దరినీ ఎందుకు కంటారో తెలుసా.. ఈ సొసైటీ పెట్టే ప్రెషర్ కు ఒకడు పోయినా.. ఒకడు ఉంటాడు అని' అనే డైలాగ్ మాత్రం హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Gurram Paapi Reddy: ఏదోటి చేయ్.. ఏరు దాటించేయ్ లిరికల్ సాంగ్
Pawan Kalyan: అచ్చివచ్చిన సెప్టెంబర్ లాస్ట్ వీక్