Rasha Thadani: చరణ్, మోక్షజ్ఞతో కాదు.. జయకృష్ణతో రాషా తడానీ రొమాన్స్

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:43 PM

ముంబై అందంపై మన మేకర్స్ మనసు పారేసుకుంటున్నారు. కొత్త అందం కోసం అక్కడి భామలను దింపుతున్నారు. ఇప్పటికే చాలా మంది బ్యూటీస్ టాలీవుడ్ బాట పట్టగా... ఇప్పుడు మరో స్టార్ కిడ్ టీటౌన్ లో ల్యాండ్ అయ్యేందుకు రెడీ అయింది.

Rasha Thadani

టాలీవుడ్ ఇండస్ట్రీ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. బాహుబలి (Baahubali), ఆర్ ఆర్ ఆర్ (RRR), పుష్ప సిరీస్ (Pushpa) తో ఓ బెంజ్ మార్క్ ను క్రియేట్ చేసింది. దీంతో టాలీవుడ్ లో నటించేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు పోటీపడుతున్నారు. బిగ్ ప్రాజెక్ట్ అయితే చాలు సైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దీపిక పదుకొణే (Deepika Padukone) , ప్రియాంక చోప్రా (Priyanka Chopra), జాన్వీకపూర్ (Janhvi Kapoor) క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా మారగా... ఇప్పుడు మరో స్టార్ కిడ్ టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.


ప్రముఖ నటి రవీనా టాండన్ (Raveena Tandon)కు టాలీవుడ్ సుపరిచితమే. బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు, వినోద్ కుమార్ సినిమాలలో రవీనా నటించింది. ఇప్పుడు ఆమె కూతురు రాషా త‌డానీ (Rasha Thadhani ) టాలీవుడ్ ఎంట్రీ ఆల్ మోస్ట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన అందం, నటనతో బాలీవుడ్ ను షేక్ చేస్తోంది రాషా. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ లుక్ లో కనిపిస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఆ అందాల భామ ఘట్టమనేని వారసుడి సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ (Jaya Krishna), బోల్డ్ డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi) కాంబోలో వస్తున్న మూవీలో హీరోయిన్ గా ఆమెనే తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ చిన్నదాన్ని ఒప్పించేందుకు చర్చలు కూడా జరిగాయని, నటించేందుకు ఆమె కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

రాషా టాలీవుడ్ ఎంట్రీ గురించి గతంలో కూడా గట్టిగానే వార్తలు వినిపించాయి. రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' ( Peddi) మూవీలో మొదట రాషా పేరు వినిపించింది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ... నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) కాంబో మూవీలో ఆమె హీరోయిన్ గా నటించబోతోందన్న వార్తలు వచ్చాయి. మళ్లీ చాలా రోజుల తర్వాత జయకృష్ణ మూవీలో మెరవనుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 15 నుంచి జరుగుతుందని అంటున్నారు. పైగా అన్న కొడుకు జయకృష్ణకు ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu) సపోర్ట్ ఉండటంతో ఈ సినిమాలో నటించేందుకు రాషా ఆసక్తి చూపుతోందట. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వస్తుందని అంటున్నారు.

విశేషం ఏమంటే... కూతురు కెరీర్ ను గాడిలో పెట్టే పనిలో ఉన్న రవీనా టాండన్... ఇటీవల 'కేజీఎఫ్ -2' లో రమికా సేన్ పాత్రలో మెప్పించింది. ఇప్పుడు తల్లి బాటలోనే కూతురు కూడా సౌత్ లో సత్తా చాటాలనుకుంటోంది. మరీ సౌత్ లో ఈ బ్యూటీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.

Read Also: Vivek Agnihotri: 'ది బెంగాల్ ఫైల్స్' విడుదలకై రాష్ట్రపతికి వినతి..

Read Also: Chiranjeevi : బాబీ బలే ముందుకొచ్చేశాడే...

Updated Date - Aug 23 , 2025 | 03:07 PM