Little Hearts Movie: రాజాగాడి లవ్‌స్టోరీ

ABN , Publish Date - Aug 08 , 2025 | 06:15 AM

తన ప్రేమను సఫలం చేసుకునేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నాల నేపథ్యంలో రూపొందుతున్న ప్రేమకథా చిత్రం ‘లిటిల్‌ హార్ట్స్‌’. మౌళి తనుజ్‌, శివానీ నాగరం జంటగా నటించారు. సాయిమార్తాండ్‌ దర్శకుడు...

తన ప్రేమను సఫలం చేసుకునేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నాల నేపథ్యంలో రూపొందుతున్న ప్రేమకథా చిత్రం ‘లిటిల్‌ హార్ట్స్‌’. మౌళి తనుజ్‌, శివానీ నాగరం జంటగా నటించారు. సాయిమార్తాండ్‌ దర్శకుడు. ‘నైన్టీస్‌ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్‌ ‘లిటిల్‌ హార్ట్స్‌’కు నిర్మాతగా వ్యవహరించారు. సెప్టెంబర్‌ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. నిర్మాత బన్నీవాస్‌, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం ‘రాజా గాడికి...’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా సాయిమార్తాండ్‌ మాట్లాడుతూ ‘మౌళీ, ఆదిత్య హాసన్‌కు కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కింది. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుంది’ అని చెప్పారు. ఆదిత్య హాసన్‌ మాట్లాడుతూ ‘నిర్మాతగా నాకు చాలా సంతృప్తినిచ్చిన చిత్రమిది. ప్రేక్షకులు ఆధ్యంతం కథతో మమేకమవుతారు. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు’ అని చెప్పారు. ‘ఈ సినిమాను నేను బాగా ఎంజాయ్‌ చేశాను. సాయిమార్తాండ్‌ సహజంగా తెరకెక్కించాడు’ అని బన్నీవాస్‌ ప్రశంసించారు. ఈ కథ ఆద్యంతం హాస్యంతో నవ్విస్తుంది. వ్యంగ్యం, వినోదం కలబోసిన సినిమా ఇది అని వంశీ నందిపాటి అన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 06:15 AM