Little Hearts: అందరికీ నచ్చుతుంది
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:16 AM
మౌళి తనుజ్, శివానీ నాగరం జంటగా సాయి మార్తాండ్ తెరకెక్కించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మించారు. ఈ సినిమా కంటెంట్ నచ్చి...
మౌళి తనుజ్, శివానీ నాగరం జంటగా సాయి మార్తాండ్ తెరకెక్కించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మించారు. ఈ సినిమా కంటెంట్ నచ్చి నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి సెప్టెంబరు 12న థియేట్రికల్‌గా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. టైటిల్ వింటే ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలోని వెంకటేశ్ గుర్తొచ్చారు. సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.