NTR 30: తుఫాను హెచ్చరిక.. పండగ లాంటి వార్త వచ్చేసింది..

ABN , First Publish Date - 2023-03-18T18:39:03+05:30 IST

తన నటన, డిక్షన్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు జూనియర్ ఎన్‌టీఆర్ (Junior NTR). ఆయనకు యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆయన కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో నటిస్తున్నారు.

NTR 30: తుఫాను హెచ్చరిక.. పండగ లాంటి వార్త వచ్చేసింది..
NTR30

తన నటన, డిక్షన్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు జూనియర్ ఎన్‌టీఆర్ (Junior NTR). ఆయనకు యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆయన కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎన్‌టీఆర్ 30’ (NTR 30) అని వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి ముహుర్తం ఫిక్సయింది. అతి త్వరలోనే పట్టాలెక్కనుంది.

‘ఎన్‌టీఆర్ 30’ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఈ సినిమా మార్చి 23న పూజా కార్యక్రమాలు జరుపుకొనుంది. అందుకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలోని అభిమానులతో పంచుకుంది. ‘‘తుఫాను హెచ్చరిక. ‘ఎన్‌టీఆర్‌30’ మార్చి 23న పూజా కార్యక్రమాలు జరుపుకొనుంది’’ అని ఎన్టీఆర్ ఆర్ట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ చిత్రంలో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు ఆమె ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్ పాత్రను చేయనున్నారు. ‘ఎన్‌టీఆర్ 30’ కి కొరటాల శివ (Kortala Siva) దర్శకత్వం వహిస్తున్నారు. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలసి భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాయి. పాన్ ఇండియాగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5న విడుదల కానుంది.

Read Also: NTR30- ఇలా అయితే సినిమాలు మానేస్తా.. ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్

‘ఎన్టీఆర్ 30’ పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. అందువల్ల మూవీ కోసం భారీస్థాయిలో సెట్స్ వేస్తున్నారు. గోవా, విశాఖ పట్నం వంటి ప్రాంతాల్లో యాక్షన్ సీన్స్‌ను షూట్ చేయనున్నారు. కానీ, ఈ స్టంట్స్‌ను ఏ విధంగా షూట్ చేయాలో చిత్ర బృందానికి అర్థం కావడం లేదు. అందువల్ల హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్‌ను రప్పించారు. ఈ టెక్నీషియన్స్ చిత్ర బృందానికి వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. సన్నివేశాలను ఏ విధంగా చిత్రీకరించాలో సలహాలు, సూచనలు అందిస్తున్నారని సమాచారం అందుతుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Jr NTR: ధనుష్, వెట్రిమారన్‌ సినిమాపై తారక్ క్లారిటీ..

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..

Updated Date - 2023-03-18T18:57:14+05:30 IST